ఆ సినిమాలో కాదు.. ఇంకో సినిమాలో

త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి ఎంతగా ఇంపోర్టన్స్ ఇస్తాడో… ఆ సీనియర్ హీరోయిన్స్ కోసం తన సినిమాల్లో ఎంతటి ఇంపార్టెంట్ రోల్స్ సృష్టిస్తాడో ఆయన [more]

Update: 2019-03-04 07:30 GMT

త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి ఎంతగా ఇంపోర్టన్స్ ఇస్తాడో… ఆ సీనియర్ హీరోయిన్స్ కోసం తన సినిమాల్లో ఎంతటి ఇంపార్టెంట్ రోల్స్ సృష్టిస్తాడో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇక ఆ పాత్రల కోసం ఏరికోరి సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. గత ఏడాది తెరకెక్కించిన అరవింద సమేత కోసం కూడా సీనియర్ హీరోయిన్స్ లో ఎవరో ఒకరిని తీసుకోవాల్సిన త్రివిక్రమ్ ఎందుకో లైట్ తీసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చిన నదియా హిట్ సినిమాల్లో సత్తా చాటుతుంది.

నగ్మాను తీసుకొస్తాడా…

తాజాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమాలోనూ ఒక సీనియర్ హీరోయిన్ ని త్రివిక్రమ్ సెలెక్ట్ చేస్తున్నాడనే ప్రచారం మొన్నటిదాకా జోరుగా జరిగింది. అది కూడా సీనియర్ హాట్ హీరోయిన్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన నగ్మా ని త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా కోసం తీసుకొస్తున్నాడని అన్నారు. మరి రాజకీయ నాయకురాలిగా మారాక నగ్మా సినిమాలకు దూరమైంది. కానీ ఈమధ్యన సుబ్బరామిరెడ్డి అవార్డ్స్ ఈవెంట్స్ లో కాస్త ఫోకస్ అయ్యేసరికి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో నగ్మాకి ఛాన్స్ వచ్చేసిందని న్యూస్ వైరల్ అయ్యింది.

అందులో కాదు మరో సినిమాలో

ఇక నగ్మా రీఎంట్రీ మీద చాలానే వవార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే త్రివిక్రమ్ సినిమాలో తనకొచ్చిన ఛాన్స్ పై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నగ్మా బయటపెట్టింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా కోసం తననెవరూ సంప్రదించలేదని చెప్పింది. అసలు తనకు ఆ సినిమాలో అవకాశం వచ్చిందనే న్యూస్ ఎందుకు బయటికొచ్చిందో అర్ధం కాలేదని చెప్పింది. ఆ సినిమాలో చెయ్యట్లేదు కానీ.. మరో థ్రిల్లర్ మూవీలో అవకాశం వచ్చినట్లుగా చెబుతుంది. మరి ఆ థ్రిల్లర్ మూవీ వివరాలు మాత్రం నగ్మా బయట పెట్టలేదు.

Tags:    

Similar News