విజయ్ దేవరకొండ సరసన సీనియర్ హీరోయిన్

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగులో మాములుగా లేదు. గత ఏడాది టాక్సీవాలా [more]

Update: 2019-03-04 07:49 GMT

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగులో మాములుగా లేదు. గత ఏడాది టాక్సీవాలా హిట్ తో ఉన్న విజయ్ దేవరకొండ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ వేసవిలో విడుదలకు సిద్దమవుతుండగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాతో సెట్స్ మీదున్నాడు. ఇక వరుసగా సినిమాలు ఒప్పుకుని సైన్ చేస్తున్న విజయ్ గత ఏడాది తమిళంలోనూ ఒక సినిమా చేసి అక్కడ కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా విజయ్ దేవరకొండ మరో తెలుగు, తమిళ సినిమాకి ఓకే చెప్పాడనే న్యూస్ నడుస్తుంది.

 

హీరోయిన్ గా నయనతార

తమిళ నాట ప్రముఖ నిర్మాత అయిన ఎస్.ఆర్.ప్రభు కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయనున్న సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండ చెయ్యబోతున్నాడు. విజయ్ దేవరకొండ లేడి సూపర్ స్టార్ నయనతారతో కలిసి నటించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో నయనతార కన్ఫర్మ్ గా నటిస్తుందట. కానీ ఈ విషయం అఫిషియల్ గా కన్ఫర్మ్ కావలసి ఉంది. ఇప్పటికే యంగ్, సీనియర్ హీరోస్ తో తెగ సినిమాలు చేస్తున్న నయనతార లేడి డైనమిక్ గా గ్లామర్ భామగా అదరగొట్టేస్తూ లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతుంది. అలాంటి విజయ్ – నయనతార కాంబోలో మూవీ అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలుంటాయి.

ఓ వైపు చిరంజీవితోనూ…

ఎలాగూ నయనతారకు తెలుగులో ఫుల్ డిమాండ్ ఉంది. కాకపోతే నయనతార ప్రస్తుతం సీనియర్ హీరో సినిమా అయిన సైరా నరసింహారెడ్డిలో నటిస్తుంది. మరి చిరుతో జోడీ కడుతున్న నయన్ ఇప్పుడు మరీ యంగ్ అయిన విజయ్ తో కూడా నటిస్తుంది. మరి వారి కాంబో ఎలా ఉంటుందో అంటున్నారు కానీ.. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో ఆ లేడి సూపర్ స్టార్ గనుక జోడీ కడితే ఆ క్రేజే వేరబ్బా..!

Tags:    

Similar News