విరాట పర్వం నుండి టబు అవుట్

నటి టబు తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఒకప్పుడు తెలుగు లో ఈమె చాలానే సినిమాలు చేసింది. నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి [more]

Update: 2019-08-10 07:10 GMT

నటి టబు తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఒకప్పుడు తెలుగు లో ఈమె చాలానే సినిమాలు చేసింది. నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా టబు ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. రీసెంట్ గా తెలుగు లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేస్తుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది.

అలానే మరో తెలుగు సినిమా చేయడానికి రెడీ చెప్పింది. రానా – సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాట పర్వం చిత్రానికి టబు ఓకే చెప్పారని ఇటీవల ప్రచారమైంది. అయితే మళ్లీ ఏమైందో ఏంటో టబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఈమె మానవ హక్కుల పోరాట నాయకురాలిగా టబు పాత్ర ఉంటుందని అన్నారు. ఇప్పుడు టబు స్థానంలో సీనియర్ నటి నందిత దాస్ ని కన్ఫామ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

టబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి కారణం తను బాలీవుడ్ లో పలు చిత్రాలకు కమిట్ అవ్వడంతో అవి మేనేజ్ చేయలేక..ఇతర భాషల్లో డేట్స్ ఇవ్వలేక సమస్య తలెత్తిందట. అందుకే రానా ప్రాజెక్టును తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది

Tags:    

Similar News