అందరికీ ఈ సరిలేరు నీకెవ్వరునే దొరికిందా

అనిల్ రావిపూడి – మహేష్ కాంబోలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ కోసం [more]

Update: 2019-07-24 07:54 GMT

అనిల్ రావిపూడి – మహేష్ కాంబోలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ ని రామోజీ ఫిలిం సిటీలో ఏయిస్తున్నాడు దర్శకుడు. రాయలసీమలో కర్నూల్ సిటిలోను కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి మహేష్ అక్కడ రియల్ లొకేషన్ లో షూటింగ్ చెయ్యడం జనాల మధ్యన కష్టమవుతుంది అని చెప్పగా.. అనిల్ ఏకంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ వేయించేస్తున్నాడు. ఇక ఈ సినిమా లో అలనాటి లేడి సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మహేష్ తో సంబంధం లేకుండా విజయశాంతి ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించబోతుంది.

ఇక ఇదే సినిమాతో సీనియర్ కమెడియన్ బండ్ల గణేష్ కూడా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. గతంలో పెళ్ళాం ఊరెళ్తే లాంటి సినిమాల్తో అలరించిన సంగీత తమిళ్ లో మాత్రం అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. తెలుగుకి చాలాకాలమే దూరంగా ఉన్న సంగీత ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవరు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. అనిల్ రావిపూడి ఆమెను ఏరికోరి ఓ మంచి పాత్రకు ఒప్పించి తీసుకొచ్చాడట. మరి అందరూ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఈ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమానే దొరికినట్లుగా కనబడుతుంది.

ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదలవ్వగానే కాంట్రవర్సీలకు నెలవుగా మారింది. జగపతి బాబు ఉన్నట్టుండి ఈ సినిమా నుండి తప్పుకోవడం, ఆ ప్లేస్ లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం వంటి విషయాలు బాగా హైలెట్ అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News