మహర్షికి కలిసొస్తుందా..?

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మహర్షి సినిమా రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ తో, ఫర్వాలేదనిపించే కలెక్షన్స్ తో [more]

Update: 2019-05-25 06:53 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మహర్షి సినిమా రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ తో, ఫర్వాలేదనిపించే కలెక్షన్స్ తో మహర్షి సినిమాని ప్రేక్షకులు ఆడిస్తున్నారు. మహేష్ కూడా కెరీర్ లో ఇంతకన్నా గొప్ప హిట్ లేదనిపించేలా ప్రమోషన్ చేసాడు. మరి మహర్షి సినిమాకి నైజాంలో తప్ప ఎక్కడా ఇంతవరకు బ్రేక్ ఈవెన్ రాలేదు. అయితే ఈ సినిమాకి కాలం వారానికోసారి కలిసొస్తుంది. అదెలా అంటే మహర్షి విడుదలైన వారానికి అల్లు శిరీష్ ఏబీసీడీ సినిమాతో రాగా… ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తో మహర్షిని రెండో వారం నిలబెట్టింది. అలా మహర్షి రెండు వారాలు సేఫ్ అయ్యాడు. ఇక ఈ వారం తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా వచ్చిన సీత సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సీతకు ఫ్లాప్ టాక్ రావడంతో

మరి సీత సినిమాతో అయినా మహర్షికి బ్రేకులు పడిపోయి కలెక్షన్స్ కి దెబ్బపడుతుందేమో అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన సీత సినిమాకి ఫ్లాప్ టాక్ పడింది. ప్రేక్షకుల నుండి, రివ్యూ రైటర్స్ నుండి కూడా సీత సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రాలేదు. కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ అన్నీ బాగున్నప్పటికీ.. కథ, కథనంలో వీక్, తేజ డైరెక్షన్ లో లోపాలు, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సినిమాకి మైనస్ కావడం, అనూప్ రూబెన్స్ సంగీతం బాగున్నా, సినిమాటోగ్రఫీ పర్వాలేదనప్పటికీ… సీత సినిమాకి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఇప్పుడు మూడో వారం కూడా సినిమా లవర్స్ కి మహర్షి సినిమానే దిక్కు అన్నట్టుగా ఉంది వ్యవహారం. మరి ఈ వారం కూడా మహర్షి కలెక్షన్స్ స్టడీగా ఉంటే మహర్షి బయ్యర్లు ఎంతోకొంత సేఫ్ అవుతారు. లేదంటే మహర్షి బయ్యర్లు నష్టపోవాల్సిందే. చూద్దాం సీత టాక్ మహర్షిని నిలబడుతుందా లేదా అనేది

Tags:    

Similar News