భారీ ధర పలికిన సీత సినిమా రైట్స్

బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ప్రతి సినిమా అతని మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీసినవే. ఈ హీరో తీసే సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. [more]

Update: 2019-03-22 06:56 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ప్రతి సినిమా అతని మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీసినవే. ఈ హీరో తీసే సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. బ్రేక్ ఈవెన్ అయినా సినిమాలు చాలా తక్కువ. అయినా గాని అతనితో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. కారణం తండ్రి బెల్లంకొండ సురేష్ లాబీయింగ్ తో ప్రతి సినిమా బాగానే అమ్ముడవుతున్నాయి. తాజాగా సీత కూడా అదే బాట పట్టింది. కాజల్, శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

భారీ ధరకు రైట్స్

అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం సీత సినిమా కూడా దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని టాక్. తేజ, కాజల్ కాంబినేషన్ లో సినిమా కాబట్టి బయ్యర్లు కాస్త మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అలా అయితే బెల్లంకొండ – కాజల్ కలిసి చేసిన కవచం సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. కావున ఈ సినిమా హిట్ అయితే తప్ప అంత కలెక్షన్ రాదు. చూద్దాం తేజ సుడి బాగుండి సినిమాకు మంచి వసూళ్లు వస్తుందేమో చూద్దాం.

Tags:    

Similar News