‘సీత’ వాయిదా పడేలా ఉంది..!

నేనే రాజు నేనే మంత్రి హిట్ తర్వాత డైరెక్టర్ తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ చేయాలి కానీ అనుకోకుండా ఆ సినిమాని వదిలేసి బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ [more]

Update: 2019-03-26 09:57 GMT

నేనే రాజు నేనే మంత్రి హిట్ తర్వాత డైరెక్టర్ తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ చేయాలి కానీ అనుకోకుండా ఆ సినిమాని వదిలేసి బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా సీత సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ 25 నుండి మే 9కి వెళ్లగానే.. సీత సినిమా ఏప్రిల్ 25కి విడుదల డేట్ లాక్ చేసుకుంది. కాజల్ హీరోయిన్ గా నటించడం, తేజ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో సీత సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మీద తేజ అలిగి సెట్స్ నుండి వెళ్లిపోయాడని టాక్ నడిచింది.

వాయిదా వేస్తున్నారా..?

అది రూమరో నిజమో క్లారిటీ లేదు కానీ సీత సినిమా షూటింగ్ పూర్తి చేసి వెళ్తానని సీత యూనిట్ కి తేజ మాటివ్వడంతోనే షూటింగ్ సజావుగా జరుగుతుందనే అన్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలయ్యే పరిస్థితులు లేవంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అందుకే ఇప్పటివరకు సీత సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదని, అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలవ్వలేదని అందుకే సీత సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ప్రచారం మొదలయ్యింది. మరి ఈ రూమర్ మీద అటు దర్శకుడు తేజ కానీ ఇటు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కానీ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News