సీత మ‌ళ్లీ వాయిదా ప‌డిందా..?

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో రెండో మూవీగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన [more]

Update: 2019-04-17 06:06 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో రెండో మూవీగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన మహేష్ మహర్షి మే 9కి పోస్ట్ పోన్ అవడంతో.. తమ సీత సినిమా ఏప్రిల్ 25న విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే మొన్నీమధ్యనే తేజ షూటింగ్ స్పాట్ నుండి అలిగి వెళ్లిపోయాడనని, కానీ షూటింగ్ మాత్రం సకాలంలో చేసి అప్పజెబుతానని మేకర్స్ కి తేజ మాటిచ్చాడని అన్నారు. షూటింగ్ లేట్ అవడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యిందంటూ కూడా వార్తలొచ్చాయి. కానీ హడావిడిగా ఉగాధి రోజున సీత టీజర్ ని విడుదల చేస్తూ తమ సినిమా ఏప్రిల్ 25నే విడుదల అంటూ ప్రకటించింది సీత టీం.

థియేట‌ర్లు దొర‌క‌క‌…

ఇక తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ సీతపై వార్తలు జోరందుకున్నాయి. మరి విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోవాలి. కానీ సీత టీం చడీచప్పుడు లేకుండా ఉంది. మరో పది రోజుల్లో విడుదల కాబోయే సీత సినిమా ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ కావాలి కానీ ఇంతవరకు మొదలవలేదు అంటే.. సీత సినిమా ఏప్రిల్ 25 నుండి వాయిదా పడిందనే న్యూస్ వినబడుతుంది. ఓవర్సీస్ లో సీతకి సరిపడినన్ని థియేటర్స్ దొరకని కారణంగా సీత సినిమాని ఏప్రిల్ 25 నుండి మే 16 కి వాయిదా వేశార‌ని తెలుస్తోంది. మరి ఓవర్సీస్ లో థియేటర్స్ దొరక్క వాయిదా పడిందా.. లేదంటే వేర్ ఏదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. కానీ సీత సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వకపోవడానికి కారణం మాత్రం సినిమా వాయిదానే అంటున్నారు.

Tags:    

Similar News