సీత సినిమాలో కాజల్ పాత్ర ఇదే..!

డైరెక్టర్ తేజ – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సీత. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా [more]

Update: 2019-02-06 07:19 GMT

డైరెక్టర్ తేజ – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సీత. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. సినిమా మొత్తం ఈ ముగ్గురి క్యారెక్టర్ల మధ్యే తిరుగుతుందని టాక్. పర్ఫార్మెన్స్ ల పరంగా ఈ సినిమా వీరికి బెస్ట్ సినిమా అవుతుందని సమాచారం. నిజానికి ఇది తేజ సొంతం సినిమా కథ కాదు. వేరే వాళ్ల దగ్గర నుంచి కథ తీసుకుని తన స్టయిల్ కు మార్చుకున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా బాగా వస్తుందని టాక్.

ముగ్గురి పాత్రలు ప్రత్యేకమే…

సీత పాత్రలో కాజల్ ఇరగతీస్తుందని.. ఆమె పాత్ర సీత పేరుకు రివర్స్ లో ఉంటుందని… చాలా రాడికల్ గా ఉంటుందని… దీనికి రివర్స్ లో హీరో చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడని టాక్. సినిమాలో సోనూ సూద్ విలన్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందట. ఈ సినిమాలో అందరి కన్నా ఎక్కువ పేరు సోనూ సూద్ కే వస్తుందని యూనిట్ వర్గాల బోగట్టా. గతంలో తేజ డైరెక్షన్ లో విలన్ గా వచ్చి గోపీచంద్ కి మంచి పేరు తెచ్చిన ‘నిజం’లా ఈ సినిమాలో కూడా సోనూ సూద్ పాత్ర అంత గుర్తుండిపోయే పాత్ర అవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News