సవ్యసాచి దుకాణం సర్దేయ్యాల్సిందే..!

Update: 2018-11-06 07:13 GMT

నాగ చైతన్యకి గత కొంతకాలంగా హిట్స్ అనేవి లేకుండా పోయాయి. యుద్ధం శరణం అట్టర్ ఫ్లాప్ అయితే.... శైలజ రెడ్డి అల్లుడు సినిమా యావరేజ్ కొట్టింది. ఇక తాజాగా చైతు - చందు మొండేటి కాంబోలో వచ్చిన సవ్యసాచి కూడా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాని చందు మొండేటి ప్రేమ కథ చిత్రం గా కాకుండా తనకు ఏమాత్రం సెట్ కానీ యాక్షన్ ఫిలింగా తీర్చిదిద్దడం ఒక తప్పైతే... చైతుకి మాస్ సెంటిమెంట్ అనేది ఇప్పటివరకు కలిసి రాలేదు. సవ్యసాచి కథ బలంగా ఉన్నప్పటికీ... కథనంలో ఉన్న వీక్ పాయింట్స్ తోనే సినిమా ఫలితం తేడా కొట్టిందనేది క్రిటిక్స్ వాదన. అలాగే తమిళ హీరో మాధవన్ పాత్రను బలంగా చూపించలేకపోవడం, మ్యూజిక్ లో పస లేకపోవడంతో సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చిందని.. హీరోయిన్ నిధి కూడా అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మరి ఈ వీకెండ్ మొగిసేసరికి సవ్యసాచి కేవలం 8 కోట్ల షేర్ రాబట్టింది. అసలే ప్రేక్షకులు తిరస్కరించారనే బాధలో ఉండగానే.. ఇప్పుడు సవ్యసాచికి విజయ్ రూపంలో మరో ముప్పు కాచుకుని కూర్చుంది.

మంచి అంచనాలతో విడుదల అవుతున్న సర్కార్...

విజయ్ - మురుగదాస్ ల కాంబోలో ముచ్చటగా మూడో మూవీగా తెరకెక్కిన సర్కార్ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి రాబోతుంది. మరి భారీ అంచనాలు, భారీ క్రేజున్న సర్కార్ సినిమా ముందు సవ్యసాచి నిలబడడం అంటే మూళ్ల మీద నించున్నట్టే. సవ్యసాచి గనక హిట్ అయ్యుండి ఉంటే గనక.. సర్కార్ ని ఎలాగో తట్టుకునేది. కానీ సవ్యసాచికి నెగెటివ్ టాక్ రావడంతో.. అసలే భారీ క్రేజున్న సర్కార్ హడావిడిలో కొట్టుకుపోవడం ఖాయంగా కనబడుతుంది. అందుకే సవ్యసాచి ఇక దుకాణం సర్దేయ్యాల్సిందే అంటూ కామెంట్స్ పడుతున్నాయి. మరి సర్కార్ కి గనక నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మురుగదాస్ డైరెక్షన్ కోసం ఈ సినిమాని ఒక్కసారైనా వీక్షిస్తారు ప్రేక్షకులు. మురుగదాస్ స్పైడర్ డిజాస్టర్ అయినప్పటికీ.. ఇప్పుడు సర్కార్ పై ఎనలేని అంచనాలున్నాయి. అందుకే సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా సవ్యసాచికి తడిచిపోవడం ఖాయం. పాపం ఇప్పటికే నెగెటివ్ టాక్ తో రన్ అవుతున్న సవ్యసాచిపై ఇప్పుడు మురుగ సర్కార్ బ్రహ్మస్త్రంలా విరుచుకుపడనుంది.

Similar News