విభిన్న కథతో ‘సవ్యసాచి’

Update: 2018-10-05 11:36 GMT

స‌వ్య‌సాచి తొలి పాట విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అక్టోబ‌ర్ 9న ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల కానుంది. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. యూట్యూబ్ లో 50 ల‌క్ష‌ల వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది. ఇందులో రెండు చేతుల‌తోనూ ఒకే బ‌లం చూపించే స‌వ్య‌దిశ వ్య‌క్తిగా చైతూ న‌టిస్తున్నారు. మ‌హాభారతంలో అర్జునుడికి మాత్ర‌మే ఉన్న శ‌క్తి ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో రాన‌టువంటి కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. స‌వ్య‌సాచిలో మాధ‌వ‌న్, భూమికా చావ్లా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. హ్యాట్రిక్ మూవీస్ ఇచ్చిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నుంచి స‌వ్య‌సాచి వ‌స్తుంది. న‌వంబ‌ర్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Similar News