సవ్యసాచి ఫస్ట్ డే కలెక్షన్స్..!

Update: 2018-11-03 07:34 GMT

నాగ చైతన్య - నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సవ్యసాచి చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూ రైటర్స్ కూడా సవ్యసాచిని ఎత్తలేకపోయారు. సినిమాలో కథ బాగున్నప్పటికీ... దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు ఆసక్తికరంగా లేదని పెదవి విరిచారు. చైతు యాక్షన్, మాధవన్ విలనిజం బాగున్నప్పటికీ.. సినిమాలో సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమాని ప్రేక్షకులు కూడా మెచ్చలేకపోయారు. మరి సవ్యసాచి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తెచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నిజాం 1.06

సీడెడ్ 0.48

నెల్లూరు 0.16

కృష్ణ 0.23

గుంటూరు 0.48

వైజాగ్ 0.53

ఈస్ట్ గోదావరి 0.19

వెస్ట్ గోదావరి 0.19

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.32

Similar News