తను మందుకొడితే... తనతోనే ఉంటాడనుకుని

Update: 2018-05-07 07:57 GMT

సావిత్రి ఒక చిన్న కుటుంబం నుండి వచ్చి అతి పెద్ద స్టార్ హీరోయిన్ గా మారింది. ఒక చదువు రాని అమ్మాయి పెద్ద నటిగా మారింది. అప్పట్లో సావిత్రిని అందరూ అంటే తోటి నటీనటులతో పాటుగా.. ప్రేక్షకులంతా ఆరాధించేవారు. మరి సావిత్రి నటిగా మారడం వెనుక, ఆమె స్టార్ హీరోయిన్ అవడం వెనుక, అలాగే ఆమె పతనం అవడం వెనుక అన్నిటిలోను ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే సావిత్రి ప్రేమికుడు, స్టార్ హీరో అయిన జెమిని గణేశన్ అనేది జగమెరిగిన సత్యం. అయితే సావిత్రికి, జెమిని గణేశన్ కి పెళ్లి కూడా అయ్యింది. మరి ఈ విషయాలను కుర్ర దర్శకుడు నాగ అశ్విన్ తాను తెరకెక్కించిన మహానటి సినిమా లో ఏమేర చూపించాడో తెలియాలంటే... కేవలం కొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.

అయితే సావిత్రి గా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మాత్రం జెమిని గణేశన్ ప్రోద్బలం, అండతోనే. జెమిని గణేశన్ తో కలిసి నటించిన సినిమాలన్ని సావిత్రికి బ్లాక్ బస్టర్స్. జెమిని గణేశన్ ని పరిచయమైన తొలినాళ్లలోనే ప్రేమించింది సావిత్రి. అలాగే పెళ్లి కూడా చేసుకుంది.కానీ పెళ్ళైన నాలుగేళ్లకుగాని వారిద్దరికీ పెళ్లి జరిగినట్టుగా ప్రపంచానికి తెలియదు. ఇక జెమిని గణేష్ తాగుడుకు బానిసై బయట తాగేసి పడిపోవడంతోనే... సావిత్రి ఒక బలమైననిర్ణయం తీసుకుందట. తనకి మందు అలవాటుంటే... తనతో కలిసి జెమిని ఇంట్లోనే తాగుతాడనే ఉద్దేశ్యంతోనే సావిత్రి అప్పట్లో మందు అలవాటు చేసుకుందట. చివరికి ఆ అలవాటు వ్యసనంగా మారి ఆమె ప్రాణాలనే తీసేసింది.

ఇక సావిత్రికి తనకు తానుగా డిజైన్ చేయించుకున్న నగలంటే చాలా ఇష్టమట. అందుకే తన ఇంట్లోనే జెమిని పంపిన నగల వ్యాపారితో తన నగలను తానే డిజైన్ చేసుకుని వారితో ఆ నగలను చేయించుకునేది. ఇక జెమిని గణేశన్ తనతో కాకుండా బయట వేరేవారితో నో సంబంధం పెట్టుకున్న కూడా సావిత్రి జెమిన్ గణేశన్ ని ప్రేమిస్తూనే ఉండేదంటే... జెమిని గణేశన్ ని ఎంతగా నమ్మిందో అనేది స్పష్టమవుతుంది. అయితే సావిత్రికి సంబందించిన ఈ విషయాలను సావిత్రి సీనియర్, అలాగే ఆమె స్నేహితురాలు అయిన షావుకారి జానకి బయటపెట్టింది. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తెరకేక్కిన్చాడో లేదో అనేది మాత్రం ప్రస్తుతం యమ ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అయితే ఈ విషయాలన్నీ తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది కానీ... అప్పటికల్లా ఇంకెన్ని అనుమానాలు మహానటిపై బయలు దేరతాయో అనేది కూడా ఆసక్తి కలిగించే అంశం.

Similar News