సావిత్రికి తిరుగులేనట్లే!!

Update: 2018-05-05 06:04 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథను మహానటి సినిమాగా తెరకెక్కించాడు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో మెరుస్తున్న ఈ సినిమా లో ఇంకా సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు వంటి స్టార్స్ కాకుండా చాలామంది పాపులారిటీ ఉన్న స్టార్స్ నటించారు. మహానటి సినిమా క్లీన్ యు సెన్సార్ సర్టిఫికెట్ తో వచ్చే వారం అంటే మే9 నే థియేటర్స్ లో కి రాబోతుంది. అయితే మహానటి సినిమా చాలా బాగా వచ్చిందని... సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మహానటి మేకర్స్.

అల్లుది యావరేజ్ టాక్ రావడంతో...

అయితే ఎంత సూపర్ హిట్ అయినా కూడా అల్లు అర్జున్ నా పేరు సూర్య ముందు నిలవడం కష్టం అనుకున్నారు అంతా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా పేరు సూర్య టాక్ ఒకే అనుకుంటే థియేటర్స్ లో దున్నేయ్యడం ఖాయం. అలా అల్లు అర్జున్ హావాని మహానటి తట్టుకుంటుందా అని అనుకున్నారు అంతా. అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య కి యావరేజ్ టాక్ పడింది. అలాగే అల్లు అర్జున్ హవా ఈ వీకెండ్ ముగిస్తేనే గాని చెప్పలేమంటున్నారు. అలాగే వీకెండ్ లో ఎలా ఉన్నా మళ్ళీ సోమవారం నుండి అల్లు అర్జున్ నా పేరు సూర్య హవా ఏమాత్రం ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మెహబూబా వల్ల కూడా....

అలా అయితే మహానటికి ఎదురుండదు. నా పేరు సూర్య వలన పడిన కాస్త టెన్షన్ ని వదిలేసి ఇప్పుడు మహానటి టీమ్ హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఎంతో ఉత్సాహంతో థియేటర్స్ లోకి దిగడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది మహానటి. ఇక ఇప్పటికే కీర్తి సురేష్ సావిత్రిలా అందరిని ఆకట్టుకుంటుంది. అచ్చం సావిత్రి పోలికలతో కీర్తి సురేష్ అందరిని మరిపిస్తుంది. మరి ఈ లెక్కన మహానటికి ఇక తిరుగులేదు. ఇక మే 11 న విడుదల కాబోతున్న మెహబూబా కూడా లవ్ స్టోరీ కావడం.. ప్రస్తుతం పూరి ఫామ్ లో లేడు గనక ఆ సినిమాపై అందరిలో పెద్దగా ఆసక్తి లేకపోవడం కూడా మహానటికి కలిసొచ్చే అంశం.

Similar News