సత్యదేవ్ చాలా లక్కినే!!

సత్యదేవ్ నటించిన ఉమామహాశ్వర ఉగ్రరూపస్య సినిమా గత వారం  నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మౌత్ టాక్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ప్రమోషస్న్ [more]

Update: 2020-08-08 05:42 GMT

సత్యదేవ్ నటించిన ఉమామహాశ్వర ఉగ్రరూపస్య సినిమా గత వారం  నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మౌత్ టాక్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ప్రమోషస్న్ తో కాస్త ఊతమిస్తే గనక వీక్షించే ప్రేక్షకులు మరింత ఎక్కువగా ఉండేవారు. ఈ సినిమాతో సత్య దేవ్ బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు. సోషల్ మీడియా టాక్ తోనే ఏ ఈసినిమాకి హిట్ టాక్ పడింది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుండి అరవింద్ ఆహా వారు ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్యాని మళ్ళీ ఆహా ఓటిటిలో విడుదల చేస్తున్నారు. డైరెక్ట్ గా ఆహా వారు విడుదల చెయ్యాలంటే ఖర్చు కాబట్టి నెట్ ఫ్లిక్స్ నుండి ఈ సినిమాని ఓ వారం తర్వాత ఆహా లో విడుదలకు ప్లాన్ చేసారు.

అయితే ఓటిటి లో హిట్ అయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ సొంతం చేసుకున్నట్లుగా టాక్. దాదాపుగా 2.5 కోట్లకు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి మా టివి, జెమిని, జీ టివి లు లతో పోటీ పది ఈ టివి ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈటీవీలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ప్రసారమవుతుంది తెలుస్తుంది. మరి సత్య దేవ్ ఓటిటిలోనే కాదు.. శాటిలైట్ హక్కుల పరంగాను మంచి ధర పట్టేసాడు. 

Tags:    

Similar News