సత్యరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్..!

‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర చేసి అందరి మనస్సులు దోచుకున్న సత్యరాజ్ తమిళంలో ఒకప్పుడు రెబెల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లోనే ఆయన హీరోగా [more]

Update: 2019-04-27 11:06 GMT

‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర చేసి అందరి మనస్సులు దోచుకున్న సత్యరాజ్ తమిళంలో ఒకప్పుడు రెబెల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లోనే ఆయన హీరోగా చేస్తున్నప్పుడు 5 కోట్ల పారితోషికం అందుకోవడం విశేషం. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం స్టార్ట్ చేసాడు. తమిళం, తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయిపోయిన సత్యరాజ్ ప్రాధాన్యత కలిగిన కీలకమైన పాత్రలను అంగీకరిస్తూ వెళుతున్నారు. రీసెంట్ గా ఆయన జెర్సీ సినిమాలో మంచి గుర్తింపు ఉండే పాత్ర చేసాడు.

సినిమాకు రెండు కోట్లు

ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన తన పాత్ర ప్రాధాన్యతను బట్టి మొత్తంగా మాట్లాడుకుంటే 2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. రోజులవారీగా అయితే రోజుకి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకు బాగా డిమాండ్ ఉంది.

Tags:    

Similar News