నెగటివ్ ప్రచారం చేస్తున్న శర్వా

సినిమా హిట్టా.. ఫట్టా అనేది సినిమా తీసేవాళ్ళకే ముందు తెలుస్తుంది. వారు సినిమా బాగా వచ్చిందని…అదిరిపోయిందని చెబితేనే జనాలల్లో నమ్మకం ఏర్పడి ఆ సినిమా చూడటానికి వస్తారు. [more]

Update: 2019-06-08 07:49 GMT

సినిమా హిట్టా.. ఫట్టా అనేది సినిమా తీసేవాళ్ళకే ముందు తెలుస్తుంది. వారు సినిమా బాగా వచ్చిందని…అదిరిపోయిందని చెబితేనే జనాలల్లో నమ్మకం ఏర్పడి ఆ సినిమా చూడటానికి వస్తారు. పెద్ద సినిమాలకి ఈ సమస్య ఉండదు అనుకోండి. చిన్న సినిమాలకి మీడియం సినిమాలకి ఈ టాక్ చాలా అవసరం. అలాంటిది ఆ సినిమా హీరోనే తన మూవీ గురించి ‘పెద్ద‌గా న‌మ్మ‌కాలు పెట్టుకోవాల్సిన ప‌ని లేదు’ అని చెబితే..ఇంకా జనాలు ఎలా నమ్ముతారు?

ఇప్పుడు శర్వా నెక్స్ట్ మూవీ ర‌ణ‌రంగం స‌మ‌స్య అదే. ఎటువంటి బజ్ లేకుండా దాదాపు ఏడాది పైనే సెట్స్ పై ఉన్న ఈమూవీ ను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో పర్లేదు అనిపించుకున్న ఈసినిమా లో శర్వా కి జోడిగా కాజల్ నటిస్తుంది. అయితే ఈ సినిమా గురించి శ‌ర్వా కాస్త నెగిటీవ్‌గా మాట్లాడుతున్నాడ‌ని టాక్‌. ‘ఈ సినిమా ఎవ‌రూ న‌మ్మ‌కం పెట్టుకోకండి. ఆడితే ఆడుద్ది.. లేదంటే లేదు’ అని త‌న స‌న్నిహితుల‌తో చెబుతున్నాడ‌ట‌. ఆ సినిమాకి హీరో అయ్యిఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారే ఆలోచించాలి. శర్వా ఇలా చెబుతున్నాడు అని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తెలిసిపోవడంతో వారు శర్వా పై గుర్రుగా ఉన్నార‌ని టాక్‌

Tags:    

Similar News