శర్వా పై వచ్చింది రూమరేనా?

రెండు రోజులు కిందట టాలీవుడ్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘రణరంగం’ విషయం శర్వా తన ఫ్రెండ్స్ తో సినిమా [more]

Update: 2019-06-09 09:49 GMT

రెండు రోజులు కిందట టాలీవుడ్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘రణరంగం’ విషయం శర్వా తన ఫ్రెండ్స్ తో సినిమా ఆడితే ఆడుతుంది లేకపోతే లేదు అని నెగటివ్ ప్రచారం చేసాడని..దాంతో డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా శర్వా పై కోపంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందొ మాత్రం క్లారిటీ లేదు.

ఎందుకుంట రీసెంట్ గా శర్వా ‘రణరంగం’ ఫైనల్ ఎడిట్ అయిన కాపీ చూసుకున్నాడు. చూసిన తరువాత తన టీమ్ తో ముచ్చటిస్తూ, సినిమా బాగా వచ్చిందని అన్నట్లు బోగట్టా. మొదటి నుండే శర్వా ఈమూవీ పై కొంచం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఫైనల్ కాపీ అవ్వకుండానే ఎడిటెడ్ కాపీ చూసాడు.

అలానే సితారకు బ్యాక్ బోన్ అయిన హారిక హాసిని చినబాబు కూడా ఎడిట్ కాపీ చూసి… రెండు మూడు చిన్న మార్పులు చెప్పి చేంజ్ చేయమని చెప్పి హీరో శర్వా కు కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తుంది. ఈమూవీ అన్ని కుదిరితే ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో శర్వా మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు

Tags:    

Similar News