భారీ లెవల్లో ఈవెంట్స్ చేస్తున్న శర్వా

శ్రీకారం సినిమా ప్రమోషన్స్ విషయంలో శర్వానంద్ కాస్త లైట్ గా ఉన్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అదే రోజు విడుదల కాబోతున్న జాతి రత్నాల పబ్లిసిటీ, [more]

Update: 2021-03-08 09:16 GMT

శ్రీకారం సినిమా ప్రమోషన్స్ విషయంలో శర్వానంద్ కాస్త లైట్ గా ఉన్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అదే రోజు విడుదల కాబోతున్న జాతి రత్నాల పబ్లిసిటీ, గాలి సంపత్ పబ్లిసిటీ  ముందు శ్రీకారం ప్రమోషన్స్ వీక్ అనిపించాయి. కానీ శర్వానంద్ మాత్రం శ్రీకారం రెండు పెద్ద ఈవెంట్స్ తో శ్రీకారంపై క్రేజీగా హైప్ పెంచేయ్యబోతున్నాడు. ఓ పక్క మెగాస్టార్ ని మరోపక్క పొలిటికల్ గాను శ్రీకారం పై హీట్ పెంచేబోతున్నాడు.

గురువారం విడుదల కాబోతున్న శ్రీకారం సినిమాకి ఏకంగా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో ఖమ్మంలో జరగబోయే ఈవెంట్ కి మెగాస్టార్ చిరు అతిధిగా రాబోతున్నారు. ప్రస్తుతం ఇల్లేందులో ఆచార్య షూటింగ్ లో ఉన్న చిరు కోసం శ్రీకారం ఈవెంట్ ని శర్వానంద్ అండ్ నిర్మాతలు కలిసి ఖమ్మంలో ఈ రోజు ఈవెనింగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క పొలిటికల్ గాను శర్వా దూకుడు మీదున్నాడు. అదెలా అంటే రేపు హైదరాబాద్ లో జరగబోయే శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆహ్వానించారు. రెండు రోజులు రెండు పెద్ద ఈవెంట్స్ తో శర్వానంద్ శ్రీకారం పై క్రేజ్ పెంచేస్తున్నాడు.

Tags:    

Similar News