హిట్ అవ్వడం ఇద్దరికీ అవసరం

నటుడు శర్వానంద్ టాలెంటెడ్ అని అతను ఎంచుకునే పాత్రలు చూస్తూనే అర్ధం అవుతుంది. తన పాత్రకు న్యాయం చేసే విధంగా సినిమాలు ఎంచుకుంటాడు శర్వా. గత సినిమాలు [more]

Update: 2019-08-14 09:04 GMT

నటుడు శర్వానంద్ టాలెంటెడ్ అని అతను ఎంచుకునే పాత్రలు చూస్తూనే అర్ధం అవుతుంది. తన పాత్రకు న్యాయం చేసే విధంగా సినిమాలు ఎంచుకుంటాడు శర్వా. గత సినిమాలు నుండి శర్వా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అతని చేసిన సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాయి.

ఆశలన్నీ రణరంగంపైనే…

‘శతమానం భవతి’ తర్వాత శర్వా నుండి సంతృప్తి చెందే సినిమా రాలేదు. ఈ మూవీ తరువాత వచ్చిన ‘పడి పడి లెచే మనసు’ పూర్తిగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం శర్వా ఆశలన్నీ ‘రణరంగం’ మీదే పెట్టుకున్నాడు. ఇక ఈమూవీ ఆగస్టు 15 న రిలీజ్ అవుతుంది. సుధీర్ వర్మ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కేశవ’తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు సుధీర్ వర్మ. సో సుధీర్ కి కూడా ‘రణరంగం’ హిట్ అవ్వడం చాలా అవసరం. ఇది హిట్ అయితే ఈ డైరెక్టర్ కి అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశముంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే చాల బాగుంది. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇందులో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఈమూవీ తరువాత శర్వా 96 అనే తమిళ చిత్రం రీమేక్ చేస్తున్నాడు.

Tags:    

Similar News