శర్వా ఆ డిజాస్టర్ డైరెక్టర్ ని తగిలించుకుంటున్నాడా?

శర్వానంద్ కి వరస ప్లాప్స్ ఊపిరాడనివ్వడం లేదు. వరసగా ప్లాప్స్ తగులుతున్న శర్వానంద్ కి త్వరలో రాబోయే శ్రీకారం సినిమా కూడా ఏం చేస్తుందో తెలియని పరిస్థితి [more]

Update: 2020-03-25 04:19 GMT

శర్వానంద్ కి వరస ప్లాప్స్ ఊపిరాడనివ్వడం లేదు. వరసగా ప్లాప్స్ తగులుతున్న శర్వానంద్ కి త్వరలో రాబోయే శ్రీకారం సినిమా కూడా ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఓ పక్క కరోనా ప్రభావం, మరో పక్క శర్వానంద్ మార్కెట్ డల్. ఈ సిట్యువేషన్ శర్వా సినిమా శ్రీకారం కొనడానికి ఎవరూ ముందుకు రావడ లేదు. జానూ తో హిట్ కొట్టిన సంతోషమనేదే లేని శర్వాకి శ్రీకారం తిప్పలు మాములుగా లేవు. శ్రీకారం సినిమా కథపై ఉన్న అనుమానాలు, శర్వా క్రేజ్ తో ఈ సినిమా ఎలా విడుదలై ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం శర్వానంద్ ఓ రిస్క్ యవ్వారం చేయబోతున్నాడట.

అదేమిటంటే తమిళనాట శర్వానంద్ ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినబడుతుంది. తమిళ దర్శకుడు రాజు సుందరం దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేస్తాడట.గతంలో జర్ని సినిమాని తమిళంలో చేసిన శర్వా కి ఆ సినిమా హిట్ అయినా.. తమిళంలో సినిమాలు చెయ్యలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి శర్వా తమిళ సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. తెలుగులో హిట్స్ ఉన్నప్పుడు తమిళ సినిమా గురించి ఆలోచిస్తే బావుండేది. కానీ శర్వా ఇప్పుడు ప్లాప్స్ లో ఉన్నప్పుడు ప్లాప్ దర్శకుడైన రాజు సుందరం తో సినిమా అంటే కష్టమే. దర్శకుడిగా ఓ డిజాస్టర్ సినిమా తీసిన రాజు సుందరం డైరెక్షన్లో శర్వానంద్ సినిమా అంటే శర్వా ఆలోచిస్తే బావుంటుంది. లేదంటే ప్లాప్ డైరెక్టర్ తో ఇప్పుడు శర్వా ఎందుకు పెట్టుకుంటాడు.

Tags:    

Similar News