శర్వానంద్ రిపేర్లు చేస్తున్నాడా?

పడి పడి లేచే యావరేజ్, రణరంగం డిజాస్టర్.. జాను ని హిట్ అనాలో.. డిజాస్టర్ అనాలో అర్ధమవడం లేదు. జానూ సినిమా సూపర్ అందులో శర్వా నటన [more]

Update: 2020-03-11 05:38 GMT

పడి పడి లేచే యావరేజ్, రణరంగం డిజాస్టర్.. జాను ని హిట్ అనాలో.. డిజాస్టర్ అనాలో అర్ధమవడం లేదు. జానూ సినిమా సూపర్ అందులో శర్వా నటన అదుర్స్. అయినా సినిమా ప్లాప్ అవడంతో.. శర్వానంద్ ఇక తన శ్రీకారం మీదే ఆశలు పెట్టుకున్నాడు. కాని శ్రీకారం సినిమా కథ నితిన్ భీష్మ కథ దగ్గర పోలికలు ఉండడంతో శర్వానంద్ బాగా కంగారు పడినట్లుగావార్తలొచ్చాయి. సేంద్రియ పద్దతులతో ఆర్గానిక్ పంటలు పండించే కుర్రాడిగా ఓ చదువుకున్న రైతుగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీకారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట.

అయితే సినిమా రషెస్ చూసిన శర్వా కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని.. సినిమాలో శర్వా నటించిన ప్రేమ కథ ఎపిసోడ్ మ‌రీ డ‌ల్‌గా ఉంద‌ని అనిపించింద‌ట‌. అయితే అలా డ‌ల్‌గా అనిపించిన సీన్స్ మల్లి కొత్తగా కాస్తంత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని రీ షూట్ చేస్తే ఎలా ఉంటుంద‌న్నఆలోచ‌న‌లో దర్శకుడుతో పాటుగా శర్వా ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. జానూ సినిమాలో డీప్ లవ్ స్టోరీలో తన నటన ప్రావీణ్యాని అంతా రంగరించిన శర్వాకి శ్రీకారంలోని ప్రేమ కథ అంతగా ఎక్కలేదని.. అందుకే మల్లి కొత్తగా ఈ ప్రేమ కథ గురించి ఆలోచిస్తే బావుంటుంది అని అంటున్నాడట. మరోపక్క సినిమా నిడివి అనుకున్నదానిక్కా కాస్త ఎక్కువే వచ్చింది అని.. ఎడిటింగ్ లో బాగా షార్ప్ గా కట్ చెయ్యాలని చూస్తున్నారట.

Tags:    

Similar News