ఇక్కడే కాదు.. అక్కడ కూడా డల్లే?

జాను చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ టాకిచ్చారు. కానీ సినిమాకి కలెక్షన్స్ చాలా డల్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్టాల్లోనూ జాను [more]

Update: 2020-02-10 07:28 GMT

జాను చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ టాకిచ్చారు. కానీ సినిమాకి కలెక్షన్స్ చాలా డల్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్టాల్లోనూ జాను సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు పల్చగానే కనబడుతున్నారు. సినిమా ఫీల్ గుడ్ క్లాసిక్ అయినప్పటికీ.. ఆ సినిమా స్లో నేరేషన్ వలన ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఒక కారణమైతే.. ఇప్పటికే ఈ సినిమాని తమిళంలో వీక్షించేయడం మరో కారణం. అలాగే తమిళ రీమేక్ 96 గనక ఆన్ లైన్ లోను, అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోను, బుల్లితెర మీద రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది అంటున్నారు.

మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వీకెండ్ డల్ కలెక్షన్స్ తో జాను సినిమా ఉండగా.. ఇలాంటి క్లాసిక్, క్లాసీ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే ఓవర్సీసీ ప్రేక్షకులు కూడా జాను సినిమాని ఆదరించనట్లే కనబడుతుంది అక్కడి వ్యవహారం. జాను సినిమా మొదటినుండి ఓవర్సీస్ వసూళ్లలో మాత్రం నెమ్మదిగానే ఉంది. ప్రీమియర్ల ద్వారా 34,168 డాలర్లు మాత్రమే వసూలు చేసిన జాను శుక్రవారం 34,391 డాలర్లు, రెండవ రోజు శనివారం జాను 52,869 డాలర్ల వసూళ్లు దక్కించుకుంది. ఆదివారం కలెక్షన్స్ కూడా అలానే ఉన్నాయి. సమంత హిట్ చిత్రం ఓ బేబీ కేవలం ప్రీమియర్ల ద్వారానే 155,000 డాలర్లను వసూలు చేసింది. దానితో పోల్చితే జాను వసూళ్లు చాలా తక్కువనే అనాలి.

Tags:    

Similar News