దానికి దీనికి బాగా సింక్ అవుతుందే!!

మహేష్ బాబు – పరశురామ్ కాంబో మూవీ మరో రెండు రోజుల్లో అధికారికంగా మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కాస్త హడావిడి చేసి [more]

Update: 2020-05-29 10:22 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబో మూవీ మరో రెండు రోజుల్లో అధికారికంగా మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కాస్త హడావిడి చేసి చేద్దామనుకుంటే… కరోనా లాక్ డౌన్ మహేష్ మూవీ ఓపెనింగ్ కి అడ్డం పడింది. జనాల మధ్యన అంగరంగ వైభవంగా ఈ ఓపెనింగ్ జరగడానికి పోలీస్ అనుమతులు దొరకలేదని తెలుస్తుంది. అందుకే మూవీ టీం చిన్నగా పూజా కార్యక్రమాలతో సినిమా ఓపెనింగ్ చేసి తన టీం ద్వారా మీడియాకి మేటర్ తో పాటుగా ఫొటోస్ ని పంపాలని చూస్తున్నారట. ఇక మహేష్ – పరశురామ్ మూవీ టైటిల్ గా సర్కారీ వారి పాట అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది.

ఇక ఈ టైటిల్ కి సరిపోయేలా గతంలో ఓ స్టోరీ ప్రచారంలోకొచ్చింది. తాజాగా మహేష్ సర్కారీ వారి పాట సినిమా కథ పై సోషల్ మీడియాలో మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో బ్యాంకులను కొల్లగొట్టి.. అప్పులు కట్టకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఉదంతంతో ఈ సినిమా ఉండబోతుంది అంటూ ప్రచారం జరగడం.. ఇప్పుడు సర్కారీ వారి పాట అంటే విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేసిన ప్రభుత్వం.. విజయ్ మాల్యాని ఇండియా రప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్ని మహేష్ సినిమాలో ఉండబోతున్నాయనే టాక్ నడుస్తుంది. గతంలో మహర్షి, భరత్ అనే నేను సినిమాల వలనే ఈ సినిమా కూడా సామాజిక సమస్య ఇతివృత్తంతోనే రూపొందే అవకాశం వుందని అంటున్నారు.. మరి మహేష్ సినిమా టైటిల్ కి విజయ్ మాల్యా ఆస్తులకి సంబంధంపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలకు తెర లేపారు. 

Tags:    

Similar News