సర్కార్.. భరత్ కి కాపీనా..?

Update: 2018-06-26 06:26 GMT

స్టార్ హీరో సినిమాలంటే రూమర్స్ క్రియేట్ అవ్వడం కామన్. అవి అప్పుడప్పుడు సినిమాకు ప్లస్ అవుతుంటాయి. ప్రస్తుతం చాలా సినిమాల కథల పట్ల గాసిప్స్ వస్తున్నాయి. అలానే లేటెస్ట్ గా తమిళ మూవీ 'సర్కార్' మూవీకి సంబంధించి ఓ రూమర్ బయటికి కి వచ్చి వైరల్ అవుతుంది. రీసెంట్ గా డైరెక్టర్ మురగదాస్.. మహేష్ బాబుతో 'స్పైడర్' సినిమాతో డిజాస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మురగదాస్.. హీరో విజయ్ తో 'సర్కార్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మూడురోజులు కిందటే రిలీజ్ అయ్యి సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది. ఇది ఒక పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా.

ఒకటే స్టోరీ లైన్ ఎంచుకున్నాడా..?

దీనిపై వచ్చిన రూమర్ ఏంటంటే మహేష్...'భరత్ అనే నేను' సినిమా పాయింట్ నే మురగదాస్ ఎంచుకున్నాడట. విదేశాల్లో చుదువుకుంటున్న కుర్రోడు కొన్ని కారణాలు వల్ల ఇండియా వచ్చి ఇక్కడ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు అనేదే భరత్ అనే నేను సినిమా స్టోరీ లైన్. సర్కార్ సినిమా స్టార్టింగ్ పాయింట్ కూడా ఇదేనట. విజయ్ అమెరికా నుండి చెన్నై వచ్చి తమిళనాడులో పాలిటిక్స్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, రాజకీయాల్లో విజయాన్ని ఎలా సాధించాడు అనేది ప్రధాన అంశమని తెలుస్తోంది.

Similar News