వివాదం వివాదమే.. రికార్డులు రికార్డులే..!

Update: 2018-11-10 08:28 GMT

మురుగదాస్ - విజయ్ కంబోలో వచ్చిన సర్కార్ సినిమాని వివాదాల సుడిగుండం పట్టుకుని వెళాడుతుంది. నిన్న మొత్తం చెన్నైలో హైడ్రామానే నడిచింది. సర్కార్ లోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం తలెత్తగా.. మురుగదాస్ అతిథి పాత్రపైనా, జయలలిత అసలు పేరు కోమలవల్లి పాత్రపైనా నానా రాద్దాం చేస్తున్నారు. నిన్న మొత్తంగా మురుగదాస్ అరెస్ట్, మురుగదాస్ ముందస్తు బెయిల్ కై తిప్పలు, పోలీసులు మురుగదాస్ ఇంటి ముట్టడి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వివాదాలకు కారణమైన కొన్ని సీన్స్ తీసేందుకు మురుగదాస్ అంగీకరించడంతో పరిస్థితి సర్దుమణుగుతుంది అనుకుంటే... అది ఇప్పట్లో ఎండ్ అయ్యేలా కనిపించడం లేదు.

రికార్డు స్థాయిలో కలెక్షన్స్

మరి ఎంత వివాదాల్లో మునిగినప్పటికీ.. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి సర్కార్ వసూళ్ల పరంగా రికార్డులను సృష్టిస్తుంది. రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించిన సర్కార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఈ సినిమాతో విజయ్ రికార్డులను కొల్లగొడుతూనే... తన కెరీర్ లోనే మూడోసారి 150కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. విజయ్ గత చిత్రాలు తేరి, మెర్సెల్ చిత్రాలు కూడా 150 కోట్ల క్లబ్బులో చోటు సంపాదించాయి. సర్కార్ విషయంలో జరుగుతన్న రాద్దాంతమే ఈ వసూళ్లు పెరగడానికి ఒక కారణమైతే.. లాంగ్ వీకెండ్ తో సర్కార్ మరిన్ని రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టేలా ఉంది. ఇకపోతే సర్కార్ వివాదంపై సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరనుండి కమల్ హాసన్, విశాల్ వరకు మురుగదాస్, విజయ్ లను సపోర్ట్ చేస్తున్నారు. సెన్సార్ జరిగిన సినిమాపై ఇలాంటి వివాదాలు చోటుచేసుకోవడం కరెక్ట్ కాదని వారు అంటున్నారు.

Similar News