‘సర్కార్’ ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు..!

Update: 2018-10-23 07:36 GMT

మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కార్’. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయి యూట్యూబ్ ను షేక్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. అలానే అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న టీజర్ కూడా ఇదే కావడం విశేషం. చిన్న టీజర్ కే ఇంతలా రెస్పాన్స్ వస్తే ఇక ట్రైలర్ కు యూట్యూబ్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మురగదాస్.. విజయ్ ఫ్యాన్స్ ఆశలపై నీరు పోశాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాడట. దాని ప్లేస్ లో ప్రోమో సాంగ్స్ ను విడుదల చేయనున్నారట.

సినిమా కంటెంట్ అర్ధం అవుతుందనే...

ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమాలో కంటెంట్ అర్ధం అయిపోతుందని మురగదాస్ ఆలోచనట. అందుకే ట్రైలర్ ను రిలీజ్ చేయట్లేదని టాక్. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వబోతుంది.

Similar News