సైలెంట్ గా ఉండడమే కరెక్టా?

దీపావళికి  హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మాస్ సాంగ్ ని అప్పుడే రిలీజ్ చేశాడు. కానీ సరిలేరు నీకెవ్వరూ టీం మాత్రం సైలెంట్ గా ఉంది. [more]

Update: 2019-10-23 07:18 GMT

దీపావళికి హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మాస్ సాంగ్ ని అప్పుడే రిలీజ్ చేశాడు. కానీ సరిలేరు నీకెవ్వరూ టీం మాత్రం సైలెంట్ గా ఉంది. ఇప్పటికే అల వైకుంఠపురములో సామజవరగమనా సాంగ్ ఓ లెవల్లో క్రేజ్ కొట్టేసింది. ఎవరి మొబైల్ రింగ్ టోన్ చూసినా సామజవరగమనే, ఎవరి మొబైల్ కాలర్ ట్యూన్ చూసినా సామజవరగమనే సాంగే. అంతలా అల వైకుంఠపురములో ప్రమోషన్స్ ఉంటే.. సరిలేరు నీకెవ్వరూ టీం మాత్రం దీపావళికి ఏ పోస్టర్ నో విడుదల చేసి మహేష్ ఫాన్స్ ని ఉసూరుమనిపించేలా ఉంది. అసలే అపోజిషన్ హీరో అల్లు అర్జున్ దూకుడు మీదుంటే మహేష్ మాత్రం సైలెంట్ గా ఉండడం మహేష్ ఫాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది.

సైలెంటయ్యారు….

అల వైకుంఠానికున్న స్పీడు మనకెందుకు.. విడుదలకు ఎక్కువ సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే గట్టి ప్రమోషన్స్ చేసేస్తే.. విడుదల సమయానికి ఇంకేం మిగలవని సరిలేరు టీం భావించబట్టే ఇలా సైలెంట్ గా ఉంటుందట. ఇప్పటినుంచే హంగామా అవసరమా అన్నట్టుగా. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 లాంటి హిలేరియస్ కామెడీ సరిలేరు లో ఉండడమే కాకుండా మహేష్ ఫాన్స్ కి కావాల్సిన మాస్ యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. మహేష్ దూకుడు సినిమాలో చేసిన కామెడీ ఒక ఎత్తైతే.. సరిలేరు లో మహేష్ కామెడీ మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతుందట. కామెడీతో కూడిన యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలెట్ అని… ముందు నుంచి అనుకున్నట్టుగా.. ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ గా నవ్వించడం ఖాయమని… అలా సినిమాకున్న ప్రచారం క్రేజ్ చాలని.. ఇప్పటి నుంచే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సరిలేరు నీకెవ్వరూ టీం భావిస్తోందట.

పండగ చేసుకుంటున్నారు….

ఇక టీం అలా సైలెంట్ గా ఉన్నప్పటికీ… సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని ఐటెం సాంగ్ లిరిక్స్ బండారు మిఠాయి బోర్డరు సిపాయి అంటూ సాగే లిరిక్స్ లీక్ అయ్యాయి. మరి తమన్నా తో మహేష్ వెయ్యబోయే ఐటెం ఊర మాస్ స్టెప్స్ కి ఈపాట కరెక్ట్ గా సింక్ అవుతుంది. మరి ఆఫీసియల్ గా ఈ సాంగ్ వదలకపోయినా.. మహేష్ ఫాన్స్ మాత్రం లీకైన ఐటెం సాంగ్ లిరిక్స్ తోనే పండగ చేసుకుంటున్నారు.

 

Tags:    

Similar News