రష్మిక కి స్పెషల్ అంట కదా?

సరిలేరు నీకెవ్వరూ టీజర్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. మహేష్ మ్యానియా, స్టైల్,కామెడీ, యాక్షన్ అన్ని సినిమాకి హైలెట్ అనేలా ఉదనడంతో.. టీజర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. [more]

Update: 2019-11-25 08:58 GMT

సరిలేరు నీకెవ్వరూ టీజర్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. మహేష్ మ్యానియా, స్టైల్,కామెడీ, యాక్షన్ అన్ని సినిమాకి హైలెట్ అనేలా ఉదనడంతో.. టీజర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే అంత పెద్ద హిట్ అయినా టీజర్ లో మహేష్ హీరోయిన్ రష్మిక లేకపోవడం ఆమె అభిమానులను హార్ట్ చేసింది. అంత పెద్ద టీజర్ లో రష్మిక మందన్న కి ప్లేస్ లేకపోవడం కూడా రష్మిక కి బాధ కలిగించిందని న్యూస్ నడిచింది. సరిలేరు టీజర్ లో రష్మిక మందన్న ని చూపించలేదంటూ ఆమె అభిమనులు అనిల్ రావిపూడి మీద ఫైర్ అయ్యారు కూడా.

అయితే రష్మిక కి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండబట్టే ఆమెని సరిలేరు నీకెవ్వరూ టీజర్ లో కనిపించకుండా హైప్ చేసారని అంటున్నారు. అయితే అనిల్ రావిపూడి.. రష్మిక ని కావాలనే దాచాడో? లేదంటే ఆమె టీజర్ లో ఎందుకు అనుకున్నాడో? తెలియదు కాని.. ఇప్పుడు రష్మిక మందన్న మీద వచ్చిన సాఫ్ట్ కార్నర్ తో ఆమెకి సరిలేరు నీకెవ్వరూ లో స్పెషల్ పబ్లసిటీ చేయబోతున్నాడని అంటున్నారు. రష్మిక నే హైలెట్ చేస్తూ సరిలేరు కి మరో టీజర్ ఉంటుందని, ఆ టీజర్ లో రష్మిక మందన్న లుక్స్, ఆమె పాత్ర తీరుతెన్నులు, రష్మిక కేరెక్టర్ ద్వారా కామెడీ పండించడం ఇవన్నీ ఆ స్పెషల్ టీజర్ లో ఉంటాయని అంటున్నారు. మరి అలా హీరోయిన్ మీద టీజర్ వదిల్తే.. రష్మిక కు కూడా స్పెషల్ గుర్తింపు రావడం ఖాయమే.

Tags:    

Similar News