రణరంగం… లుక్ అండ్ టీజర్ కుమ్మేసాడు

ఎప్పుడో షూటింగ్ మొదలైన శర్వా – సుధీర్ వర్మ చిత్రం ఇంతవరకు ఒక అప్ డేట్ కూడా ఇవ్వలేదు. అయితే చాలా కాలం తరువాత ఈసినిమా యొక్క [more]

Update: 2019-05-26 06:29 GMT

ఎప్పుడో షూటింగ్ మొదలైన శర్వా – సుధీర్ వర్మ చిత్రం ఇంతవరకు ఒక అప్ డేట్ కూడా ఇవ్వలేదు. అయితే చాలా కాలం తరువాత ఈసినిమా యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ను రిలీజ్ చేసారు. దీనికి రణరంగం అనే టైటిల్ పెట్టారు. నిజానికి ఈమూవీకి దళపతి అనే పేరు పెడదామనుకున్నారు. కానీ అదే టైటిల్ ను ఓ చిన్న సంస్థ రిజిస్టర్ చేయించుకుంది.

సో చివరకి రణరంగం అనే టైటిల్ తో ముందుకు వచ్చారు. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు శర్వానంద్. అందులో ఒక పాత్రలో వయసుమళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నాడు. యంగ్ గెటప్ లో 80ల బ్యాక్ డ్రాప్ తో ఉన్న లుక్ ను నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు.

ఈమూవీ ఆగస్ట్ 2న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమా కు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించాడు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు

Tags:    

Similar News