ఎన్నడూ చేయని ఇంట్రెస్టింగ్ పాత్రలో శర్వా

లవర్ బాయ్ నుండి గ్యాంగ్ స్టర్ వరకు ఎటువంటి పాత్రైనా చేసే దమ్ము ఉంది శర్వానంద్ కు. రీసెంట్ గా అతను రణరంగం సినిమాలో గ్యాంగ్ స్టర్ [more]

Update: 2019-08-24 10:07 GMT

లవర్ బాయ్ నుండి గ్యాంగ్ స్టర్ వరకు ఎటువంటి పాత్రైనా చేసే దమ్ము ఉంది శర్వానంద్ కు. రీసెంట్ గా అతను రణరంగం సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్ర చేసి అందరిని ఫిదా చేసాడు. కానీ సినిమా రిజల్ట్ వేరేలా వచ్చిందిలెండి. ఇక ప్రస్తుతం శర్వా తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం 96 రీమేక్ లో నటిస్తున్నాడు. 50 శాతానికిపైగా ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించడం జరిగింది. ఇందులో శర్వా కి జోడిగా సమంత నటిస్తుంది. ఇందులో శర్వా మరోసారి లవర్ బాయ్ గా కనిపించనున్నాడు.

ఇక ఈమూవీ తరువాత మరో సినిమా ని కూడా అప్పుడే లైన్ లో పెట్టేసాడు శర్వా. ఈసారి ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రానున్నాడు శర్వా. గతంలో శర్వా చేసిన శతమానం భవతి మూవీ తరహాలో సాగే ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని సమాచారం. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాకి శ్రీకరం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈసినిమా ద్వారా పరిచయం కానున్నాడు. అయితే ఇందులో శర్వా ఎన్నడూ చేయని పాత్ర చేస్తున్నాడు. రైతుగా శర్వానంద్ కనిపించనున్నాడు. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Tags:    

Similar News