మహేష్ వరమిచ్చినా.. వీసా దేవుడు దారివ్వడం లేదు!!

మహేష్ బాబు తో సినిమా చెయ్యాలనేది ఆ దర్శకుడి కల. అందుకే రెండేళ్లుగా మహేష్ కాంపౌండ్ చుట్టూనే తిరిగాడు. కానీ మహేష్ ఒప్పుకోలేదు. దానితో యంగ్ హీరో [more]

Update: 2020-10-23 05:49 GMT

మహేష్ బాబు తో సినిమా చెయ్యాలనేది ఆ దర్శకుడి కల. అందుకే రెండేళ్లుగా మహేష్ కాంపౌండ్ చుట్టూనే తిరిగాడు. కానీ మహేష్ ఒప్పుకోలేదు. దానితో యంగ్ హీరో నాగ చైతన్య తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చాక ఆ దర్శకుడిని మహేష్ పిలిచి అవకాశం ఇచ్చాడు. మరి ఆ దర్శకుడెవరో ఈపాటికే అర్ధమవ్వాలి. అతనే పరశురామ్. పరశురామ్ మహేష్ ని ఒప్పించి సర్కారు వారి పాటని మొదలు పెట్టేసాడు. కరోనా వలన షూటింగ్ ఆగినా మహేష్ ఉన్నాడనే ధైర్యం. మహేష్ వరమిచ్చేసాడు… ఇంకేంటి అన్న ధీమా. కరోనా ఉన్న సినిమా షూటింగ్ చెయ్యడానికి మహేష్ ఓకె చెప్పాడు. మహేష్ సైడ్ నుండి నుండి పెరిఫెక్ట్ గానే జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి టెంక్షన్ లేదు.

కానీ షూటింగ్ కోసం అందరూ సిద్ధం, అన్ని రెడీ అయినా వీసా ప్రాబ్లెమ్. అవును సర్కారు వారి పాట యూనిట్ అమెరికా వెళ్ళడానికి వీసా ప్రాసెస్ అవడం లేదు. గత నెల రోజులుగా వీసా కోసం పడరాని పట్లు పడుతుంది సర్కారు వారి పాట యూనిట్. అమెరికాలో దాదాపుగా 45 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉండగా.. ముందు అక్కడి షెడ్యూల్ తోనే సినిమా మొదలెట్టాలని పరశురామ్ భావించి మహేష్ ని ఒప్పించి రంగంలోకి దిగబోయే టైం కి వీసా అడ్డం పడింది. వీసాల దరఖాస్తులు ఇంతవరకు ప్రాసెస్ కాలేదని సమాచారం. వీసాల జారీ మరింత జాప్యం జారొగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అంటే సార్కారు వారి పాట షూటింగ్ మొదలవడానికి కూడా లేటె అన్నమాట. పాపం పరశురామ్ దేవుడు వరమిచ్చినా పూజారి  వరమివ్వలేదన్నట్టుగా ఉంది పరిస్థితి.

Tags:    

Similar News