ఇది చూస్తుంటే… బ్రేకప్ అయినట్లే కనబడుతుంది

బాలీవుడ్ లో ఈమధ్యన ఓ యంగ్ కపుల్ బ్రేకప్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. కార్తీక్ ఆర్యన్ – సారా అలీ ఖాన్ లిద్దరూ డీప్ లవ్ [more]

Update: 2019-12-09 05:58 GMT

బాలీవుడ్ లో ఈమధ్యన ఓ యంగ్ కపుల్ బ్రేకప్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. కార్తీక్ ఆర్యన్ – సారా అలీ ఖాన్ లిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని అందుకే వారిద్దరూ పార్టీలకు పబ్ లకు తెగ తిరిగారని అన్నారు. నిజంగానే సారా – కార్తీక్ లు లంచ్ పార్టీ అని, డిన్నర్ పార్టీ అని, వెకేషన్స్ కి బాగానే తిరిగారు. అయితే గత కొన్నాళ్లుగా సారా అలీఖాన్ – కార్తీక్ ఆర్యన్ లు కలిసి కనిపించడం మానేసేసరికి.. వారిద్దరికి బ్రేకప్ అయినట్లుగా కూడా వార్తలొచ్చాయి. సారా అలీఖాన్ – కార్తీక ఆర్యన్ లు కలిసి ఇంతియాజ్ డైరెక్షన్ లో ఆజ్ కల్ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ – సారా ల మద్యం ప్రేమ చిగురించింది అంటారు. అయితే ఆజ్ కల్ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన సినిమా ఫిబ్రవరిలో విడుదలకాబోతుంది

అయితే కార్తీక్ ఆర్యన్ తాజాగా మరో హీరోయిన్ ను డేట్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినబడుతున్నాయి. కార్తీక్ రీసెంట్ గా హిట్ కొట్టిన పతి పత్ని ఔర్ హో చిత్ర హీరోయిన్ అనన్య పాండే తో డేట్ లో ఉన్నాడనే న్యూస్ నడుస్తుంది. అయితే సారా తో బ్రేకప్ చెప్పేసిన కార్తిక్, అనన్య తో కలిసి తిరుగుతున్నాడని అంటున్నారు. అదలా ఉంటె ప్రస్తుతం కార్తీక్ సారాతో కలిసి షూట్ చేయడానికి నో చెప్పడంతో.. వీరి మధ్యన లవ్, బ్రేకప్ నిజమే అంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆజ్ కల్ సినిమా షూటింగ్ పూర్తయినా.. మరికొన్ని సీన్స్ ని యాడ్ చేస్తే సినిమాకి బావుంటుంది అని దర్శకుడు ఇంతియజ్ అనుకోవడంతో.. కార్తీక్ ఆర్యన్ ని సంప్రదించగా.. కార్తీక్ మాత్రం సారా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో.. వాళ్ళ మధ్యన విభేదాలు తార స్థాయిలో ఉన్నాయనే టాక్ మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యింది.

Tags:    

Similar News