స‌ప్తగిరి రిస్క్ చేస్తున్నాడా?

Update: 2018-07-15 07:13 GMT

ఇప్పటికే ‘స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్‌’, ‘స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాల్లో హీరోగా నటించిన కమెడియన్ స‌ప్తగిరి లేటెస్ట్ గా కొత్త డైరెక్టర్ డి.రామ‌కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘గజదొంగ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో స‌ప్తగిరి మరోసారి హీరోగా కనిపించబోతున్నాడు అంట.

అయితే ఈసారి సప్తగిరి కామెడీ మూవీ కాకుండా, తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈయన రూట్ మార్చి కమెర్షియల్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ప్రధానంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనుందని సమాచారం. ఇది విలేజ్ మరియు టౌన్ నేపథ్యంలో సాగే కథ అంట.

కమెడియన్ గా పేరు ఉన్న స‌ప్తగిరి ఇప్పుడు యాక్షన్ హీరోగా మన ముందుకు రానున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక ఈ చిత్రం ఆగ‌స్టు చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నంద నంద‌నా ప్రాజెక్ట్స్ బ్యానర్ పై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు

Similar News