సరిలేరు పై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఏంటి

వచ్చే సంక్రాంతికి ఒకటికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మరో రెండు సినిమాలు [more]

Update: 2019-10-15 08:39 GMT

వచ్చే సంక్రాంతికి ఒకటికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మరో రెండు సినిమాలు పోటీకి రానున్నాయి. అయితే ఇంత పోటీ ఉంటే బయ్యర్లు భారీ రేట్లు ఆఫర్‌ చేయడానికి వెనకాడతారు. కానీ సరిలేరు నీకెవ్వరుకి పోటీకి సంబంధం లేదు అంటున్నారు బయ్యర్లు.

నీకెవ్వరుపై నమ్మకం….

ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మాతలే నైజాం, వైజాగ్‌తో పాటు ఈస్ట్‌ గోదావరిలో కూడా రిలీజ్ చేయనున్నారు. సినిమా మీద కాంఫిడెన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈమూవీ మిగిలిన ఏరియాలకి గాను ‘సరిలేరు నీకెవ్వరు’ థియేట్రికల్‌ రైట్స్‌ డెబ్బయ్‌ కోట్ల వరకు పలుకుతున్నాయట. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకునే సరిలేరు నీకెవ్వరుపై బయ్యర్స్‌ చాలా నమ్మకంగా వున్నారు. మహేష్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా ఈ సినిమా పై పెద్దగా ఎఫెక్ట్ కాదని నమ్ముతున్నారు ట్రేడ్ వాళ్ళు.

 

 

Tags:    

Similar News