సంక్రాతి బరిలో ఉండేవి ఇవేనా ?

Update: 2018-05-29 08:37 GMT

ఇంకా సంక్రాతి పండగకి ఏడెనిమిది నెలలుంది. అప్పుడే సంక్రాతి బరిలో నిలిచే సినిమాల హడావిడి మొదలైపోయింది. ఎప్పుడూ సంక్రాంతికి సీనియర్ స్టార్లు, స్టార్ హీరోస్, చిన్న హీరోలు పోటీ పడుతూ సంక్రాతి హీరోలనిపించుకోవాలని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కానీ చాలామంది స్టార్లు సంక్రాతి సెంటిమెంట్ గా భావిస్తారు కూడా. ప్రస్తుతం 2017 సంక్రాతి భారీ సినిమాలతో చప్పగా ఉండగా.. 2018 సంక్రాంతికి మాత్రం భారీ లెవల్లో పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకులకు అసలు సిసలైన సంక్రాతి సంబరం చూపడానికి సిద్దమవుతున్నాయి. అయితే ఏయే సినిమాలు సంక్రాతి బరిలో ఉన్నాయంటే మాత్రం అప్పుడే చెప్పడం కష్టం.

బయోపిక్ ల జోరు...

ప్రస్తుతానికి బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని సంక్రాతి రిలీజ్ అంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయో పిక్ అతి త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లబోతుంది. మరి క్రిష్ అనుకున్న టైం కి సినిమాని పూర్తి చేసి సినిమాని విడుదల చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు. ఆల్రెడీ బాలయ్య - క్రిష్ లు కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి తో సంక్రాతి స్టార్స్ అనిపించుకున్నారు కూడా. ఇక చిరంజీవి - రామ్ చరణ్ - సురేందర్ రెడ్డిల‌ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ సై రా నరసింహారెడ్డి కూడా సంక్రాంతికే విడుదల అంటూ చెబుతూ వస్తున్నారు సైరా యూనిట్ వాళ్ళు. కానీ చిరు సై రా సంక్రాంతికి విడుద‌ల‌వ‌డం కొద్దిగా కష్టమంటున్నారు. మరోపక్క ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయినట్లు గా చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా దీని షూటింగ్ మొత్తం అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారని కూడా అంటున్నారు.

అన్నీ పెద్ద సినిమాలే...

ఇక ముచ్చటగా మూడోది వైఎస్సార్ బయో పిక్ యాత్ర సినిమా కూడా సంక్రాతి బరిలో ఉంటుంద‌ని ఫిలింనగర్ టాక్. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గా తెరకెక్కుతున్న యాత్ర సినిమా షూటింగ్, అందులోని నటీనటులు వివరాలు తెలియవు గాని.. యాత్ర సినిమా కూడా సంక్రాంతికే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. ఇక మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న మహేష్ 25 మూవీ కూడా సంక్రాతి బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా మహేష్ - వంశి ల షూటింగ్ మొదలవ్వలేదు గాని.. సినిమా క‌చ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందనే కాన్ఫిడెంట్ తో దిల్ రాజు అండ్ బ్యాచ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బాలయ్య ఎన్టీఆర్ బయో పిక్ తో, చిరు సైరా తో, మమ్ముట్టి యాత్రతో, మహేష్ కొత్త సినిమాతో సంక్రాతి బరిలో ఉంటే గనక.. ఆ పోరు మాములుగా ఉండదు.. రసవత్తరంగా ఉంటుంది.

Similar News