ఇక్కడ చరణ్, ఎన్టీఆర్... అక్కడ రజనీ, అజిత్..!

Update: 2018-11-02 07:21 GMT
Ram Charan Junior NTR Rajamouli #RRR

ప్రతియేడు సంక్రాంతికి బడా స్టార్స్ అంతా తమ తమ సినిమాలతో గట్టిగా పోటీ పడుతుంటారు. చాలామంది హీరోలు సంక్రాంతికి తమ అభిమానులను హుషారెత్తిస్తారు. ఎప్పుడూ టాలీవుడ్ లో సంక్రాతి పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. కేవలం స్టార్ హీరోలు మాత్రమే ఈ సంక్రాంతికి పోటీ పడుతుంటారు. చిన్న హీరోలెవరైనా ఆ పోటీలోకొస్తే గాల్లో కొట్టుకుపోవడమే. ఇక 2019 టాలీవుడ్ సంక్రాతి బరిలో రామ్ చరణ్ - బోయపాటి మాస్ ఎంటెర్టైనెర్ తో పాటుగా... క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కూడా విడుదలవుతుంది. మరి ఆనందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు

సంక్రాంతి బరిలో బడా హీరోలు

ఇక కోలీవుడ్ లోను ఇద్దరు బడా హీరోలు 2019 సంక్రాంతికి తమ తమ సినిమాలతో అభిమానులను అలరించనున్నారు. తమిళనాటే కాదు సౌత్ మొత్తం అభిమానులు ఉన్న రజనీకాంత్ కి పోటీగా అభిమాన గణం ఉన్న హీరో అజీత్ తమ తమ చిత్రాలతో సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు. రజనీకాంత్ - కార్తీక్ సుబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న పెటా చిత్రం జనవరి 11న విడుదలకు సిద్ధమవుతుంది. మరి రజనీకాంత్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఇక అజిత్ - శివ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ విశ్వాసం కూడా జనవరి 10నే విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.

డబ్బింగ్ చిత్రాలు పోటీ ఇచ్చేనా..?

మరి ఇద్దరు బడా స్టార్స్ చిత్రం ఒక్క రోజు గ్యాప్ తో విడుదల కావడం అంటే అభిమానులకు మాములుగా ఆనందంగా లేదు. మరి తమిళనాట హోరాహోరీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ సినిమాలను ఇక్కడ టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారు. అయితే రామ్ చరణ్, బాలయ్య సినిమాలకు ఉన్న ఉన్న క్రేజ్ ఆ డబ్బింగ్ సినిమాలుకు లేకపోయినా... ఆ సినిమాల వలన ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ తగ్గే ప్రమాదం ఉంది. చూద్దాం 2019 పొంగల్ మరెంత రసవత్తరంగా మారుతుందో అనేది.

Similar News