కావాలని తీయించుకున్నాడా..?

Update: 2018-07-02 10:07 GMT

బాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన సంజయ్ దత్ బయోపిక్ భారీ కలక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రకి రణబీర్ కపూర్ ప్రాణం పోసాడు. రణబీర్ అచ్చం సంజయ్ దత్ లానే నటించి అందరిని మెప్పించడమే కాదు.. రణబీర్ కేరీర్ లోనే ఎప్పటికి గుర్తిండిపోయే పాత్రని చేసాడు. ఇకపోతే సంజయ్ దత్ బయోపిక్ గా తెరక్కేక్కిన సంజు సినిమాలో సంజయ్ దత్ జీవితాన్ని పాజిటివ్ గా చూపించారు అనే అపవాదు తప్ప సినిమా మొత్తంగా అందరికీ నచ్చేలా దర్శకుడు హిరాణి తెరకెక్కించాడు. అయితే హిరానీ సంజయ్ దత్ మీద సాఫ్ట్ కార్నర్ తోనే ఇలా సంజయ్ దత్ ని ఉత్తముడిగా చూపించారని విమర్శలు ఉన్నాయి.

మంచివాడిగా చూపించుకున్నాడా..?

అయితే ఇలా సినిమాని చెక్కించింది మాత్రం సంజయ్ దత్ అనే టాక్ వినబడుతుంది. ఎందుకంటే సంజయ్ దత్ జీవితం సినిమాలో చూపించిన అంత అందంగా అయితే లేదు. టాడా చట్టం కింద అరెస్ట్‌ అవడం... అక్రమ ఆయుధాల కేసులో కొన్నేళ్ల పాటు జైలు లో గడపడం మాత్రమే కాదు సంజయ్‌ దత్‌ తన జీవితంలో అనేక తప్పులు చేసాడు. మత్తుపదార్ధాలకు బానిసగా మరడం, అమ్మాయిల వెంటపడడం, అమ్మాయిలను మాయమాటలు చెబుతూ స్త్రీ లోలుడుగా మారి సంజయ్ డాట్ అనేక తప్పులకు కారణమయ్యాడు. అయితే తాను తన లైఫ్ లో ఇన్ని తప్పులు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పడానికా అన్నట్టు ఈ బయోపిక్‌ తీయించుకున్నాడు అనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది.

సంజయ్ పై సింపతి...

ఇక ఈ తరం ప్రేక్షకులకు సంజయ్ దత్ చేసిన తప్పులు తెలియవు. అందుకే సినిమాలో చూపించినవి నిజమని నమ్ముతున్నారు. అందుకే సంజయ్ దత్ మీద సింపతీ కురిపిస్తున్నారు కూడా. మరి సంజయ్ లోని నెగెటివ్ కోణాన్ని తెలివిగా.. పాజిటివ్ గా చూపించి సంజయ్ మంచి వాడు... తప్పులు చేసిన మంచివాడు అని నిరూపించే ప్రయత్నం ఈ సంజు సినిమాలో జరిగింది అని అంటున్నారు సంజయ్ దత్ జీవితాన్ని చదివిన వారు. ఏది ఏమైనా సంజు సినిమా సంజయ్ దత్ కి ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

Similar News