రికార్డులు తిరగరాస్తున్న సంజు

Update: 2018-07-09 10:08 GMT

సంజయ్ దత్ జీవితచరిత్ర ఆధారంగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కిన సంజు సినిమా వసూళ్లపరంగా దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని అందుకుంది. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. దీంతో చిత్రం దూసుకుపోతోంది. పైగా గత శుక్రవారం భారీ సినిమా ఏదీ విడుదల కాకపోవడం కూడా సంజుకి కలిసివచ్చింది. పదిరోజులుగా అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఆదివారం రూ.28.05 కోట్లు వసూలు చేయగా ఇప్పటిరవకు మొత్తం రూ.265.48 కోట్లను రాబట్టింది.

రోజూవారీగా సంజు వసూళ్లు(కోట్లలో)

జూన్ 29(శుక్రవారం) రూ.34.75

జూన్ 30(శనివారం) రూ.38.60

జులై 1(ఆదివారం) రూ.46.71

జులై 2(సోమవారం) రూ.25.35

జులై 3(మంగళవారం) రూ.22.10

జులై 4(బుధవారం) రూ.18.90

జులై 5(గురువారం) రూ.16.10

జులై 6(శుక్రవారం) రూ.12.90

జులై 7(శనివారం) రూ.22.02

జులై 8(ఆదివారం) రూ.28.05

మొత్తం(10 రోజులు) రూ.265.48 కోట్లు

Similar News