సంజు కోసం సంజయ్ ఎంత తీసుకున్నాడు..?

Update: 2018-07-09 06:48 GMT

'సంజు' సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. తొలిరోజు నుండే కలెక్షన్స్ జోరు చూపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే 200 కోట్లు గ్రాస్ ని దాటేసిన ఈ సినిమా సెకండ్ వీకెండ్ లోకి అడుగు పెట్టి అదే జోరుతో దూసుకుపోతుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్లు ను అవలీలగా దాటేస్తుందని ట్రేడ్ చెబుతున్నాయి.

స్నేహం ఉన్నా డబ్బు తీసుకున్నాడా...

ఈ సినిమా దర్శక నిర్మాతైనా రాజ్ కుమార్ హిరాని భారీ లాభాలు అందుకుంటున్నాడీ చిత్రంతో. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అతను ఎంత తీసుకున్నాడు? తన బయోపిక్ తెరకెక్కిచాలంటే ఎంత డబ్బు తీసుకుని ఉండొచ్చు ? అన్న సందేహాలు కలగటం సహజం. డైరెక్టర్ హిరాణితో మంచి స్నేహం ఉన్నప్పటికీ సంజయ్ ఊరికే కథను తీయడానికి ఒపుకోలేదంట.

లాభాల్లో వాటాలు కూడా

ఈ బయోపిక్ ను తీసేందుకు ఏకంగా రూ.10 కోట్లు సమర్పించుకున్నాడట. అంతే కాదు ఆ చిత్రానికి వచ్చే లాభాల్లో సంజయ్ కి వాటా ఉందంట. మరి ఈ లెక్కన సంజయ్ ఎంత తీసుకుంటాడో అప్పుడే తెలియదు. వాస్తవాన్ని ఈ బయోపిక్ తీసినందుకు హిరానికి సంజునే ఎంతో రుణ పడి ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలో సంజయ్ ను చాలా పాజిటివ్ గా చూపించాడు కాబట్టి.

Similar News