సంజయ్ అసిస్టెంట్‌ ఎవరో తెలుసా..?

Update: 2018-07-21 08:13 GMT

తన తొలి చిత్రం 'మున్నాబాయ్ ఎంబీబీఎస్'తో తానేంటో నిరూపించుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. చేసింది తక్కువ సినిమాలైనప్పటికీ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. అతని మొదటి చిత్రం 'మున్నాబాయ్ ఎంబీబీఎస్' ఇండియన్ ఫిలిం హిస్టరీలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

రీమేక్ లూ విజయమే...

అలానే తమిళంలో కూడా కమల్ హాసన్ ఈ సినిమాను రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. అసలు రీమేక్స్ జోలికి వేళ్లని కమల్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసాడంటే ఈ సినిమా గొప్పదనమేంటో అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా హిరాని ‘మున్నాబాయ్ లగేరహో’ తీస్తే అది కూడా సూపర్ హిట్టయింది. కానీ తెలుగులో చిరంజీవి రీమేక్ చేసినప్పటికీ ఫస్ట్ పార్ట్ అంత సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత 'త్రీ ఇడియట్స్’, ‘పీకే’ చిత్రాలు తీసిన ఆయన.. ఇటీవలే ‘సంజు’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వెంటనే ఒప్పేసుకున్న రణబీర్

'సంజు' ఇండియన్ బాక్సాఫీస్ ని ఎంతలా షేక్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు హిరాని నెక్స్ట్ ఏ సినిమా తీస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పటినుండో ‘మున్నాబాయ్’ సిరీస్‌లో మూడో సినిమాను తీయాలనుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు హిరాని. అయితే ఇందులో కూడా సంజయ్ దతే హీరో. మరి సినిమాలో సంజయ్ అసిస్టెంట్‌గా ఎవరు చేస్తున్నారు అన్న టైంలో తెరమీదకు రణబీర్ కపూర్ పేరు వచ్చింది. 'సంజు' సినిమాతో తనలోని మరో కోణాన్ని చూసిన హిరాని.. రణబీర్ అసిస్టెంట్‌గా అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించాడట. అందుకు రణబీర్ కూడా తన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టేసి ఒకే చెప్పేశాడట. ఈ కాంబినేషన్ కచ్చితంగా అమితాసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.

Similar News