సందీప్ వంగా వొంగుతాడా?

సందీప్ వంగా అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. సొంత కథ, సొంత నిర్మాణంతో పాపులర్ అయిన సందీప్ వంగా బాలీవుడ్ లోను [more]

Update: 2020-05-23 06:10 GMT

సందీప్ వంగా అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. సొంత కథ, సొంత నిర్మాణంతో పాపులర్ అయిన సందీప్ వంగా బాలీవుడ్ లోను అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో సందీప్ వంగా పై స్టార్ హీరోలంతా మనసు పారేసుకుంటున్నారు కానీ.. అవకాశాలే ఇవ్వడం లేదు. అయితే అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ తర్వాత బాలీవడో లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కలేదు. దానితో మళ్ళీ సౌత్ కె వచ్చిన సందీప్ నెక్స్ట్ సినిమాపై ఇంకా స్పష్టత లేదు.

అయితే సందీప్ తన దగ్గరున్న కథతో స్టార్ హీరోల చుట్టూ తిరిగినా పనవలేదు. అయితే తాజాగా సందీప్ వంగా దగ్గరికి ఓ రీమేక్ సినిమా వచ్చినట్లుగా టాక్. ఇంతకుముందే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సందీప్ కి అడ్వాన్స్ ఇచ్చింది. సందీప్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే సందీప్ దగ్గరున్న కథకి ఇంకా హీరో సెట్ కాలేదు కాబట్టి.. తమ దగ్గర ఓ ప్రపోజల్ ఉందని.. తమ దగ్గర అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ చేయాలని ప్రపోసల్ పెట్టారట. మరి మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చెయ్యగల దమ్ము సందీప్ కి ఉందని సితార నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ ప్రపోజల్ కి సందీప్ ఒంగుతాడా? అనేది ఇప్పుడు వారి ముందున్న పెద్ద టార్గెట్ అంటున్నారు. భారీ పారితోషకం కూడా ఆఫర్ చేసినట్లుగా టాక్.

Tags:    

Similar News