నిర్మాతను నిందిస్తే ఎలా సందీప్..?

Update: 2018-12-17 08:09 GMT

ప్రస్తుతం యంగ్ హీరోలలో సందీప్ కిషన్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది. వరుస ఫ్లాప్స్ తో విలవిలలాడుతున్న సందీప్ కిషన్ కి నిన్నగాక మొన్న విడుదలైన నెక్స్ట్ ఏంటి మాములుగా షాక్ ఇవ్వలేదు. అసలా సినిమాని సందీప్ ఎందుకు ఒప్పుకున్నాడనేది సినిమా చూసిన ఏ ఒక్కరికి అర్ధం కాలేదు. కేవలం హీరోయిన్ గా తమన్నా చేస్తుందని ఒప్పుకున్నాడేమో అనే సెటైర్స్ కూడా పడ్డాయి. తమన్నా గ్లామర్ సినిమాని హిట్ చేస్తుందా..? అసలు మతి ఉండే సందీప్ ఇలాంటి కథలను ఒప్పుకుంటున్నాడా అని సందీప్ సన్నిహితులే తిడుతున్నారు. అయితే నెక్స్ట్ ఏంటి సినిమా కథ, కథనం మాములు బోర్ ఫీల్ అవ్వలేదు ప్రేక్షకుడు. తమన్నా గ్లామర్ గా ఎంతగా రెచ్చిపోయిన కథలో బలం లేకపోతె సినిమా ఆడదు. నెక్స్ట్ ఏంటి సినిమా కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేదంటే ఆ సినిమా పరిస్థితి ఏమిటనేది అర్ధమవుతుంది.

నిర్మాత వల్లే ఫెయిల్ అయ్యిందట...

నెక్స్ట్ ఏంటి సందీప్ కిషన్ కి కోలుకోలేని డిజాస్టర్ అయ్యింది. అయితే సినిమా కథ, కథనం, దర్శకత్వం బాగోలేక ఫ్లాప్ అవలేదట... నిర్మాత సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడం వల్లనే ఈ సినిమా పోయిందట. మరి ఇలా అన్నది ఎవరో కాదు.. స్వయానా సందీప్ కిషన్ అంటున్న మాట. నెక్స్ట్ ఏంటి సినిమాలో బోల్డ్ కంటెంట్ తో పాటు మంచి కథ కూడా ఉందని. అయితే నిర్మాతలు సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్లనే డిజాస్టర్ అయిందని... లేదంటే సినిమా బాగుండేదని చెబుతున్నాడు హీరో. మరి నిర్మాత ప్రమోట్ చెయ్యకపోయినా.. సినిమాలో విషయం ఉంటే ఆటోమాటిక్ గా ఆడుతుంది. సినిమాలో విషయం లేకపోతే నిర్మాత ఎంతగా ప్రమోట్ చేసిన వేస్ట్ అనేది సందీప్ కి కూడా తెలుసు కానీ..!

Similar News