అక్కడ కట్టప్ప… మరి ఇక్కడ?

బాహుబలి సినిమా లో నటుడు సత్య రాజ్ పాత్ర సినిమాకి చాలా కీలకం. ప్రభాస్ కి రానా కి చిన్నప్పుడు యుద్ధ విన్యాసాలు నేర్పే గురువుగా, ప్రభాస్ [more]

Update: 2020-07-16 04:16 GMT

బాహుబలి సినిమా లో నటుడు సత్య రాజ్ పాత్ర సినిమాకి చాలా కీలకం. ప్రభాస్ కి రానా కి చిన్నప్పుడు యుద్ధ విన్యాసాలు నేర్పే గురువుగా, ప్రభాస్ బాహుబలి పాత్రకి వెన్నంటి ఉండే సైనికుడిగా, అలాగే మాహిష్మతి రాజ్యానికి బానిసగా సత్య రాజ్ నటన హైలెట్. అయితే ఇప్పుడు అలాంటి పాత్రే RRR లో కూడా ఉండబోతుందట. అయితే బాహుబలి కట్టప్ప గా సత్య రాజ్ వేసిన పాత్ర లాంటిది RRR లో తమిళ నటుడు సముద్ర ఖని చేస్తున్నాడట. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న RRR సినిమాలో ఓ కీలక పాత్రలో సముద్ర ఖని కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సముద్ర ఖని రోల్ పై ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఆదేమిటంటే…

RRR లో సముద్ర ఖని పాత్ర కొమరం భీం కి రామ్ అల్లూరి పాత్ర దారి రామ్ చరణ్ కి సహాయకుడి పాత్రగా ఉండబోతుందట. ప్రత్యర్థులపై కొమరం భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు చేసే పోరాటాలలో వారికి సహాయం చేసే వాడిగా సముద్ర ఖని పాత్రని రాజమౌళి తీర్చిదిద్దాడట. ఈ పాత్ర కోసం సముద్ర ఖని భారీ మొత్తంలోనే పారితోషకం తీసుకున్నాడని.. సముద్ర ఖని పాత్ర సినిమాకి కీలకం అని చెబుతున్నారట. ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో కొమరం భీం, ఆలూరి సీతారామరాజులకి గురువు పాత్రలో నటించబోతున్నాడని టాక్ ఉంది.

Tags:    

Similar News