'సామి స్క్వేర్' తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎంతో తెలుసా..?

Update: 2018-09-15 08:06 GMT

తమిళ హీరో విక్రమ్ సినిమాలంటే ఒక్కప్పుడు తెలుగు రైట్స్ ఎగబడి కొనేవారు. కానీ అతనికి గత కొంత కాలం నుండి వరుస డిజాస్టర్స్ రావడంతో అతని మార్కెట్ పడిపోయింది. దీంతో ఇప్పుడు అతని సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా మూడు కోట్ల లోపే కొంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా విక్రమ్ లేటెస్ట్ మూవీ 'సామి స్క్వేర్' తెలుగు అనువాద హక్కులు అమ్ముడయ్యాయి. 'సామి స్క్వేర్' తెలుగు రైట్స్ ఎనిమిది కోట్లు పలికాయి. అయితే దానికి కారణం విక్రమ్ మాత్రం కాదు. ఇందులో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ వల్లే అంత మార్కెట్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'మహానటి' సినిమాతో అందరి మనసులు దోచుకున్న కీర్తి నెక్స్ట్ మూవీ స్వామి స్క్వేర్ కావడంతో అంత రేట్ వచ్చింది అంటున్నారు. ఇక, మరో కారణం ఆ సినిమా డైరెక్టర్ హరి.

సింగం దర్శకుడు కావడంతో...

హరి తీసిన 'సింగం' సిరీస్ సినిమాలన్నీ బాగా ఆడి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో కూడా ఈ సిరీస్ బాగా ఆడింది. అందుకే అంత రేట్ రావడానికి మరో కారణం. ఇంకో కారణం ఏంటంటే ఇది 'సామి' కి సీక్వెల్ కాబట్టి. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై నమ్మకంతో అంత రేట్ వచ్చిందని చెబుతున్నారు. చూద్దాం ఈ సినిమా అంత హిట్ అయ్యి విక్రమ్ కు తెలుగులో మంచి మార్కెట్ ను తెచ్చిపెడుతుందేమో.

Similar News