సెప్టెంబ‌ర్ 13న స‌మంత యూ-ట‌ర్న్..!

Update: 2018-08-28 11:00 GMT

యూ-ట‌ర్న్ విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 13న ఖ‌రారైంది. స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన యూ-ట‌ర్న్ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళ‌, తెలుగులో క‌లిపి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమిక చావ్లా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

న‌టీన‌టులు:

స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ ర‌వీంద్ర‌న్, న‌రైన్

సాంకేతిక విభాగం:

క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్

నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు

బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్

సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి

సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి

ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్

ఎడిటర్: సురేష్ ఆర్ముగం

పిఆర్ఓ: వంశీ శేఖ‌ర్

Similar News