ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో త్వరలో మొదలు కాబోయే సినిమా టైటిల్ గా ఆసక్తికర టైటిల్ ప్రచారం లో ఉంది. హస్తినకు పోయి రావాలె టైటిల్ అయితే [more]

Update: 2020-02-26 06:18 GMT

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో త్వరలో మొదలు కాబోయే సినిమా టైటిల్ గా ఆసక్తికర టైటిల్ ప్రచారం లో ఉంది. హస్తినకు పోయి రావాలె టైటిల్ అయితే బావుంటుంది అని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా ఈ సినిమాలో పేరున్న హీరోయిన్ అంటే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యలో త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం పూజ హెగ్డే నే హీరోయిన్ గా తీసుకుంటాడని కాదు… రష్మిక అయితే ఎన్టీఆర్ కి సూట్ అవుతుంది అని ప్రచారం జరుగుతుంది.

తాజాగా అక్కినేని కోడలు సమంత పేరు ప్రచారంలోకొచ్చింది. ఎలాగూ త్రివిక్రమ్ – ఎన్టీఆర్ లతో సమంత చాలా సినిమాలు చేసింది, అలాగే ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి సమంత అయితే ఎన్టీఆర్ కి జోడిగా బావుంటుంది అని తివిక్రమ్ భావిస్తున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సమంత తో ఎన్టీఆర్ నాలుగుసార్లు జోడిగా నటించాడు. ఇప్పుడు ఇది కూడా సెట్ అయితే ఐదోసారి వీళ్ళ జోడి తెర మీద కనిపిస్తుంది.

Tags:    

Similar News