నా కథ కూడా సావిత్రి కథలానే అనిపించింది

Update: 2018-06-03 10:06 GMT

నటి సావిత్రి జీవిత కథకు నా కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని హీరోయిన్ సమంత వెల్లడించింది. హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్న ఈ అక్కినేని వారి కోడలు ఓ డైలీ పేపర్ ఇంటర్వ్యూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

మహానటి సావిత్రి కథ తెలుసుకున్నాకా తన కథ కూడా అలానే ఉందని అనిపించిందని చెప్పింది. ప్రేమ విషయంలో సావిత్రి నమ్మినట్టుగానే నేను నమ్మానని.. కానీ అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని..లేకుంటే తన కథ కూడా సావిత్రి లానే అయ్యి ఉండేదని చెప్పింది. అయితే ఆ బాధ నుండి త్వరగానే బయట పడ్డానని..తాను చేసుకున్న పుణ్యం వల్లే నాకు చైతు దొరికాడని తెలిపింది.

సినిమాల్లో అవసరమైతే రొమాన్స్ కూడా సిద్ధమేనని, నటన తన వృత్తని చెప్పింది. రొమాన్స్ అనేది సినిమాలో భాగమేనని.. సినిమాలతో మూడు తరాలుగా అనుబంధం ఉన్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు తన నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదని అంది. ఇకనుండి తన సినిమాలకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని అంటుంది

Similar News