సమంత తప్పుకోలేదు.. ఇదే సాక్ష్యం!

సమంత అసలు తెలుగు సినిమాలే కాదు.. ఏ భాషా సినిమాలను ఒప్పుకోవడం లేదు. కాకపోతే టాక్ షోస్, జిమ్ అంటూ సమంతా మాత్రం ఫుల్ బిజినె. ఆహా [more]

Update: 2020-12-12 05:09 GMT

సమంత అసలు తెలుగు సినిమాలే కాదు.. ఏ భాషా సినిమాలను ఒప్పుకోవడం లేదు. కాకపోతే టాక్ షోస్, జిమ్ అంటూ సమంతా మాత్రం ఫుల్ బిజినె. ఆహా ఓటిటి కోసం టాక్ షో తో పాటుగా హిందీ వెబ్ సీరీస్ లో నటించిన సమంత తమిళంలో ఒప్పుకున్న ఓ సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కి ముందు ఆ సినిమా నుండి సమంత తప్పుకుందనే న్యూస్ నడిచింది. సమంత – నయనతార – విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్ గా నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువక్కుల రెండు కాదల్ సినిమా షూటింగ్ స్పాట్ లో నయనతారకి సమంతకి ఈగో క్లాష్ రావడంతో సమంత ఆ సినిమా నుండి తప్పుకుందనే టాక్ నడిచింది. అయితే లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ ఆగిపోయినా.. సమంత ఆ సినిమా చేయడం లేదనే అన్నారు.

 కాతువక్కుల రెండు కాదల్ షూటింగ్ స్పాట్ లో నయనతారకు సమంతకి చిన్నపాటి గొడవైనట్లుగా, విగ్నేష్ కూడా నయన్ కి సపోర్ట్ చెయ్యడంతో సమంత తప్పుకుంది అన్నారు. అయితే మూవీ టీం కూడా సమంత తప్పుకుంది అని కానీ, ఉంది అని కానీ ట్వీట్ చెయ్యకపోయేసరికి సమంత తప్పుకుంది అనే న్యూస్ కి బలం చేకూరింది. తాజాగా సమంత కాతువక్కుల రెండు కాదల్ నుండి తప్పుకోలేదని.. సమంత కూడా  ఉందని చిత్ర బృందం చెప్పకనే చెప్పింది. కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా షూటింగ్స్ ప్రారంభమైనట్టుగా.. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువక్కుల రెండు కాదల్ షూటింగ్ మళ్ళీ పూజ కార్యక్రమాలతో మొదలయ్యింది. ఆ ఫొటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్ర బృందం నయనతారతో పాటుగా విజయ్ సేతుపతి అలాగే సమంత ని కూడా టాగ్ చెయ్యడంతో.. కాతువక్కుల రెండు కాదల్ నుండి సమంత తప్పుకోలేదు, అలాగే నయన్ కి సామ్ కి ఎలాంటి ఈగో క్లాష్ కాలేదని చిత్ర బృందం తేల్చేసింది.

Tags:    

Similar News