లీకైన వీడియో చూసి షాకైన క్యూట్ కపుల్..!

Update: 2018-10-27 08:22 GMT

'నిన్ను కోరి' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకి అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య - సమంతలను పెట్టి ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి 10 రోజులపైనే అవుతుంది. పెళ్లి అయిన తరువాత భార్యాభర్తల మధ్య ఉండే బాండింగ్ గురించి శివ ఇందులో చూపించనున్నాడు. ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ చిత్రంకి సంబంధించి ఓ వీడియో లీక్ అయింది. ఓ ఇంట్లో కూర్చొని చైతు-సామ్ మాట్లాడుకుంటున్న వీడియో బయటికి వచ్చింది.

పోస్ట్ చేసిన అభిమాని...

ఈ వీడియోను సామ్ వీరాభిమాని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి...‘‘ఈ వీడియో చూశాక.. అద్భుతమైన భావన కలిగింది. మీరు చైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా సమంత..? ‘మజిలీ’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను చూసిన సామ్ షాక్ అయ్యి ఎమోజీలను కామెంట్‌గా పెట్టింది. ఆ తరువాత ఆ వీడియో ట్విట్టర్ నుండి డిలీట్ చేసేశారు.

Similar News